Google Pixel 10: దేశంలో పండగ సీజన్ ప్రారంభమైంది. దీపావళి సందర్బంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ అనేక వస్తువులపై భారీ డిస్కౌంట్లనీ అందిస్తున్నాయి. ఈ సేల్ లో పిక్సెల్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం కావచ్చు. ఇటీవల మార్కెట్లో లాంచ్ అయినా గూగుల్ పిక్సెల్ 10 ఇప్పుడు అమెజాన్ లో గణనీయమైన తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే వినియోగదారులకు ఇది బెస్ట్ ఆప్షన్.
గూగుల్ పిక్సెల్ 10 డీల్:
ఇండియాలో గూగుల్ పిక్సెల్ 10 12GBRAM+256GB స్టోరేజ్ వేరియంట్ రూ.79,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అయితే సేల్ లో భాగంగా ఈ పరికరం రూ.67,130కి లిస్ట్ అయింది. అంటే..ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఈ ఫోన్‌పై రూ.12,869 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అదనంగా, కస్టమర్లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై అదనంగా రూ.1,250 తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. కాకపోతే ఎక్స్‌ఛేంజ్ వాల్యూ ఫోన్ కండిషన్ , మోడల్ పై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి.
also read:Red Magic 11 Pro Series: 8000mAh బ్యాటరీతో రెడ్ మ్యాజిక్ 11 ప్రో సిరీస్ లాంచ్..ఫీచర్స్ అదుర్స్!
గూగుల్ పిక్సెల్ 10 ఫీచర్లు:
ఫీచర్ల విషయానికి వస్తే..గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. భద్రత కోసం డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా రక్షించబడింది. ఫోన్ టెన్సర్ G5 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 12GB వరకు RAM, 256GB అంతర్గత నిల్వతో జత చేశారు. ఫోటోగ్రఫీ పరంగా..గూగుల్ పిక్సెల్ 10 మాక్రో ఫోకస్‌తో కూడిన 48MP ప్రధాన సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌కు మద్దతు ఇచ్చే 10.8MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. ఇది సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 10.5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. బ్యాటరీ గురించి మాట్లాడితే..ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4,970mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది.


