Google Pixel 10: మీరు చాలారోజుల నుంచి గూగుల్ తాజా పిక్సెల్ 10 పరికరాన్ని కొనుగోలు చేయాలనీ ప్లాన్ చేస్తుంటే, ఇదే మీకు సరైన అవకాశం. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 10 ఫోన్‌పై గొప్ప డీల్‌ను అందిస్తోంది. దీని ధరను దాదాపు రూ.14,000 తగ్గించింది. అయితే, ప్రస్తుతం ప్రత్యక్ష సేల్ లేనందున, ఇది పరిమిత-కాల ఒప్పందంగా కనిపిస్తోంది. తాజా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో ఇటువంటి డీల్‌లు చాలా అరుదు. కావున ఆఫర్ ఉన్నప్పుడే కొనేయడం మంచిది. ఇప్పడు ఈ ఫోన్ ఆఫర్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
డిస్కౌంట్
గూగుల్ ఈ శక్తివంతమైన పరికరాన్ని రూ.79,999 ప్రారంభ ధరకు లాంచ్ చేసింది. అయితే, రూ.11,570 ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో కేవలం రూ.68,429కి అందుబాటులో ఉంది. ఇంకా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.3,000 వరకు అదనపు తగ్గింపుతో సహా ఫోన్‌పై ఆకట్టుకునే బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ మరింత డిస్కౌంట్ కోసం ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు.
also read:Ray Ban Meta Glasses: మెటా మొట్టమొదటి స్మార్ట్‌గ్లాసెస్ చూశారా..? ఫీచర్లు అదుర్స్..ధర ఎంతంటే..?
ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే..గూగుల్ అద్భుతమైన పిక్సెల్ 10 6.3-అంగుళాల OLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ వరకు గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా రక్షణ పొందుతుంది. ఈ పరికరం గూగుల్ టెన్సర్ G5 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ 12GB వరకు ర్యామ్, 256GB వరకు అంతర్గత నిల్వను అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం..ఈ పరికరం 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా, 5x ఆప్టికల్ జూమ్‌ను అందించే 10.8MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో, ఫోన్ 10.5MP కెమెరాను కలిగి ఉంది. ఇక బ్యాటరీ గురించి మాట్లాడితే..ఈ ఫోన్ 4,970 mAh బ్యాటరీతో 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది.


