Saturday, November 15, 2025
Homeటెక్నాలజీDiscount: గూగుల్ పిక్సెల్ 8a పై అదిరిపోయే డిస్కౌంట్..ఏకంగా రూ.15,000 తగ్గింపు..

Discount: గూగుల్ పిక్సెల్ 8a పై అదిరిపోయే డిస్కౌంట్..ఏకంగా రూ.15,000 తగ్గింపు..

Google Pixel 8a Discount: తక్కువ బడ్జెట్‌లో మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, పిక్సెల్ 8a ఒక గొప్ప ఎంపిక అవుతుంది. ఇది ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కాంపాక్ట్ డిజైన్, శక్తివంతమైన కెమెరాలు, క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్, AI- ఆధారిత ఫీచర్లను కలిగి ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న ఆఫర్, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

 

ఆఫర్:

గూగుల్ పిక్సెల్ 8a 8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.52,999. అయితే, ఇప్పుడు ఏకంగా రూ.15,000 తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.37,999 కె అందుబాటులో ఉంది. దీనితో పాటు, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.7,000 అదనపు తగ్గింపు కూడా పొందొచ్చు. తద్వారా దీని ధర రూ.30,999కి తగ్గుతుంది. నెలకు రూ.1,584 నుండి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI ఎంపిక కూడా ఉంది. అంతేకాదు, ఈ ఫోన్ పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. పాత ఫోన్ కండిషన్, మోడల్‌ను బట్టి ఈ తగ్గింపు రూ.29,200 వరకు ఉంటుంది.

Also Read: Smart Phones: రూ.6500 ధరతో ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్ కొనాలా..? లిస్ట్ ఇదే..

ఫీచర్లు:

ఈ పరికరం 6.1-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2,000 nits పీక్ బ్రైట్‌నెస్‌ను పొందుతుంది. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ అందించారు. ఈ ఫోన్ గూగుల్ టెన్సర్ G3 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఇందులో 8GB LPDDR5x RAM, 128GB/256GB UFS 3.1 స్టోరేజ్ ఎంపికలను అందించారు. ఇక ఫోటోగ్రఫీ కోసం, ఇది 64MP క్వాడ్ PD ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, ఈ ఫోన్ 13MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 4,492mAh బ్యాటరీ ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad