Flipkart Sale: యాపిల్ ఇటీవల తన కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఐఫోన్ పాత మోడళ్లు గణనీయమైన తగ్గింపులు లభిస్తున్నాయి. ఐఫోన్ 17 లాంచ్ తర్వాత కంపెనీ ఐఫోన్ 16 ధరను సుమారు రూ.10,000 తగ్గించింది. దీంతో ధర దాదాపు రూ.70,000కి చేరుకుంది. అయితే, సెప్టెంబర్ 23న ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ ఫోన్‌ను ఇప్పటివరకు ఉన్న అత్యల్ప ధరకే అందిస్తుంది. సేల్ సమయంలో మీరు ఈ ఐఫోన్‌ను కేవలం రూ.51,999కి కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ఇప్పుడు దీని ఆఫర్, ఫీచర్ల గురించి మరింత తెలుసుకుందాం.
ఐఫోన్ 16పై డిస్కౌంట్: ఆఫర్
యాపిల్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ 16 ప్రస్తుతం రూ.69,900 ధరలో కొనుగోలుకు ఉంది. కానీ ఈ సేల్ సమయంలో మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ.51,999కి కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ నో-కాస్ట్ EMI ఎంపికలను కూడా అందిస్తుంది. దీంతో ఈ పరికరాన్ని సులభమైన వాయిదాలతో కొనుగోలు చేయవచ్చు.ఇంకా చెప్పాలంటే ఈ ధరకు ఎటువంటి బ్యాంక్ కార్డ్ ఆఫర్లు లేకుండానే అందుబాటులో ఉంటుంది. ఇది ఇప్పటివరకు ఉన్న ఉత్తమ ఐఫోన్ డీల్‌లలో ఒకటిగా మారుతుంది.
ఐఫోన్16: ఫీచర్లు
ఐఫోన్ 16 ఫీచర్ల గురించి చెప్పాలంటే..ఈ పరికరం 6.1-అంగుళాల సూపర్ రెటినా HDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 3-నానోమీటర్ టెక్నాలజీపై ఆధారపడిన A18 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ పరికరం టెక్స్ట్ రైటింగ్ టూల్స్, ఆడియో రికార్డింగ్ ట్రాన్స్‌క్రిప్షన్, ఆబ్జెక్ట్ రికగ్నిషన్‌తో సహా ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఫోన్ కెమెరా కూడా చాలా శక్తివంతమైనది. 48-మెగాపిక్సెల్ ఫ్యూజన్ సెన్సార్, అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. ఫోన్‌లో ప్రత్యేకమైన కెమెరా కంట్రోల్ బటన్ కూడా ఉంది. ఇది మీరు అద్భుతమైన ఫోటోగ్రఫీని ఆస్వాదించడానికి అనుమతిస్తుంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


