Moto G86 Power 5G: మీరు రూ.15,000 బడ్జెట్‌లో కొత్త మోటరోలా స్మార్ట్‌ఫోన్ కోసం కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్! ఫ్లిప్‌కార్ట్ మోటరోలా G86 పవర్ 5G ఆకట్టుకునే డీల్ అందిస్తోంది. ప్రస్తుతం దీని ధర భారీగా తగ్గింది. ఈ-కామర్స్ సైట్ పరికరం కొనుగోలుపై ధర తగ్గింపులతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా అదనపు పొదుపులను అందిస్తోంది. ఇప్పుడు మోటరోలా G86 పవర్ 5G ఆఫర్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
డిస్కౌంట్:
మోటరోలా G86 పవర్ 5G స్మార్ట్ ఫోన్ 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ రూ.17,999 కు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్‌లలో IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,500 తగ్గింపు ఉంటుంది. దీని వలన ప్రభావవంతమైన ధర రూ.15,499 కి చేరుకుంటుంది. అదనంగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఇది ధరను రూ.15,650 వరకు తగ్గిస్తుంది. అంతేకాకుండా ఎంపిక చేసిన మోడల్‌లు అదనంగా రూ.2,000 తగ్గింపును పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ వాల్యూ పాత ఫోన్ మోడల్, కండిషన్ పై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి.
also read:Kidney Health: జాగ్రత్త..ఈ డ్రింక్స్‌తో కిడ్నీలకు ముప్పు..
ఫీచర్లు:
మోటో G86 పవర్ 5G ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ పరికరం 2712×1220 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల సూపర్ HD అమోలేడ్ డిస్‌ప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ పరికరం ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. కెమెరా సెటప్ పరంగా..G86 పవర్ 5G పరికరం f/1.88 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను, వెనుక భాగంలో f/2.2 ఎపర్చర్‌తో 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. ఇక సెల్ఫీల కోసం..f/2.2 ఎపర్చర్‌తో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ విషయానికి వస్తే.. ఇది 33W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6720mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. కనెక్టివిటీ ఎంపికల పరంగా.. ఇది USB టైప్-సి పోర్ట్, బ్లూటూత్ 5.4, 5G, 4G LTE, Wi-Fi 6, డ్యూయల్ సిమ్ సపోర్ట్, GPS వంటి ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68+IP69 రేటింగ్ ను కలిగి ఉంది. భద్రత కోసం, ఫోన్ ఫేస్ అన్‌లాక్, ఆన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా అందిస్తుంది. కొలతలు పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ 161.21 mm పొడవు, 74.74 mm వెడల్పు, 8.65 mm మందం, 198 గ్రాముల బరువు ఉంటుంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


