Nothing Phone 3 Discount: చాలా కాలంగా ప్రత్యేకమైన డిజైన్‌తో కూడిన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే, న్యూస్. అమెజాన్ నథింగ్ ఫోన్ 3 స్మార్ట్ ఫోన్ పై గొప్ప డీల్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌పై ఏకంగా 38% వరకు భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్ లో ఫ్లాగ్‌షిప్ పరికరాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి గొప్ప డీల్‌గా మారుతుంది. అయితే, జూలై 1, 2025న కంపెనీ తయారుదారు నథింగ్ ఈ పరికరాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోన్ పై ఉన్న ఆఫర్ ఫీచర్ల వివరాల గురించి తెలుసుకుందాం.
నథింగ్ ఫోన్ 3 ఆఫర్:
ఈ పరికరం ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 28,500 తగ్గింపుతో ఎటువంటి ఆఫర్ లేకుండానే కేవలం రూ.52,999కి అందుబాటులో ఉంది. అంతే ఇది దాని లాంచ్ ధర కంటే రూ.33,000 తక్కువ. ఇది మాత్రమే కాదు, బ్యాంక్ ఆఫర్‌లతో ఫోన్‌ను మరింత చౌకగా కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు, కస్టమర్‌లు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా రూ.1500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు, ఆ తర్వాత ఫోన్ ధర కేవలం రూ.51,499కి తగ్గుతుంది.
దీనితో పాటు, కంపెనీ ఈ పరికరంపై ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దాదాపు రూ.31,000 వరకు ఎక్స్ఛేంజ్ విలువను పొందవచ్చు. అయితే, ఈ ఎక్స్ఛేంజ్ విలువ పూర్తిగా పాత ఫోన్ కండిషన్, బ్రాండ్ పై ఆధారపడి ఉంటుంది. అంతే కాదు, ప్రతి నెలా రూ.2,557 చెల్లించి ఫోన్‌ను కొనుగోలు చేయగల EMI ఎంపికలో కూడా ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
also read:Google Pixel 10 series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ విడుదల.. ధర, ఫీచర్లు ఇలా..!
నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్లు
ఈ నథింగ్ పరికరంలో 6.67-అంగుళాల అమోలేడ్ డిస్‌ప్లేను చూడవచ్చు. ఇది HDR10 + సపోర్ట్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలాగే, ఈ పరికరం 4,500 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్నిఅందిస్తుంది పొందుతారు. ఫోన్‌ను శక్తివంతం చేయడానికి, స్నాప్‌డ్రాగన్ 8s జనరేషన్ 4 ప్రాసెసర్ దీనిలో ఉపయోగించారు. దీనితో పాటు, ఫోన్‌లో 16GB వరకు RAM, 512GB వరకు నిల్వ కూడా అందించారు.
ఈ పరికరం 5,500mAh బిగ్ బ్యాటరీతో 65W ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం.. ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP పెరిస్కోప్ లెన్స్, 50MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం..ఫోన్‌లో 50MP కెమెరా కూడా ఉంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


