One Plus 13: త్వరలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 ప్రారంభం కానుంది. ఈ సేల్ లో ప్రీమియం ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లపై బంపర్ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలోనే వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ చవక ధరకే కొనుగోలుకు ఉంది. దీని లాంచ్ ధర కంటే దాదాపు రూ.15,000 తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ఆఫర్స్, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఆఫర్
వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.72,999. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కు ముందు రూ.69,999కి లిస్ట్ అయింది. అంటే.. దాదాపు రూ.3000 ఆదా. ఇప్పటికే ఈ ఫెస్టివల్ సేల్ లో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ పై ఉన్న డీల్స్ రెవీల్ అయ్యాయి. ఈ డీల్స్ లో భాగంగా వన్ ప్లస్ 13 పరికరాన్ని బంపర్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ల తర్వాత 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.57,999కి లభిస్తుంది. అంతేకాదు, దీని పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.
Also Read:Primebook AI Laptops: AI ఫీచర్లతో ప్రైమ్‌బుక్ రెండు నయా ల్యాప్‌టాప్‌లు..ధర కూడా తక్కువే..
స్పెసిఫికేషన్లు
వన్ ప్లస్ 13 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.88-అంగుళాల క్వాడ్ HD ప్లస్ ప్రో XDR డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. పనితీరుకోసం ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను అమర్చారు. కెమెరా గురించి మాట్లాడితే, వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 100W వైర్డ్ ఛార్జింగ్ మద్దతుతో శక్తివంతమైన 6000 mAh బ్యాటరీను కలిగి ఉంది. పోటీ పరంగా ఈ ఫోన్ వివో V40 ప్రో 5G, హానర్ 200 ప్రో 5G, ఐఫోన్ 16, గూగుల్ పిక్సెల్ 9a వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


