OnePlus 13R Discount: ఈ ఏడాది మొదట్లో మార్కెట్లో విడుదల అయినా వన్ ప్లస్ 13R స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ ఇండియాలో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు, ప్రీమియమ్ పరికరాన్ని కొనుగోలు చేయాలనుకుంటే ఇది ఒక ఉత్తమ ఎంపిక. మరి ఆలస్యమెందుకు ఈ ఫోన్ పై ఉన్న ఆఫర్ , ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
వన్ ప్లస్ 13R ఆఫర్:
వన్ ప్లస్ అసలు ధర రూ. 42,999. ఆఫర్ లో భాగంగా ఈ పరికరం ఇప్పుడు అమెజాన్ ఇండియాలో రూ. 39,999కి లిస్ట్ అయింది. అంటే ఇది దాని లాంచ్ ధర కంటే రూ. 3,000 తక్కువ. దీనితో పాటు, ICICI బ్యాంక్, RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMIపై ₹ 3,250 అదనపు తగ్గింపు పొందొచ్చు. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా దాదాపు రూ. 33,050 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. అయితే, ఇది పరికరం మోడల్, కండిషన్ పై ఆధారపడి ఉంటుంది.
Also Read: SmartPhones: అమెజాన్ ఫ్రీడమ్ సేల్..ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు..!
వన్ ప్లస్ 13R ఫీచర్లు:
ఈ పరికరం 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో 6.78-అంగుళాల 1.5K LTPO అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 7iతో వస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 16GB వరకు LPDDR5x RAM, 512GB UFS 4.0 నిల్వతో జత చేశారు. ఇక ఫోటోగ్రఫీ కోసం..ఇది 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం..ముందు భాగంలో 16MP కెమెరా ఉంది. ఈ పరికరం 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. వన్ ప్లస్ 13R IP65 రేటింగ్‌తో వస్తుంది. ఇది దుమ్ము, నీటి నిరోధకతను కలిగిస్తుంది. ఇందులో ఆక్వా టచ్ 2.0 ఫీచర్ కూడా ఉంది. ఇది తడిగా ఉన్నప్పుడు కూడా స్క్రీన్‌ను ప్రతిస్పందించేలా చేస్తుంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి


