One Plus 13R: మీరు తక్కువ ఖర్చుకే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవాలని చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్! ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ గొప్ప డీల్‌ను అందిస్తోంది. ప్రస్తుతం వన్ ప్లస్ 13R పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఏడాదిలో మొదట్లో మార్కెట్లో రూ.42,999 ధరకు లాంచ్ అయినా వన్ ప్లస్ 13R స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.38,500 కంటే తక్కువ ధరకే కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ పరికరంలో అమోలేడ్ డిస్ప్లే, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, 6000mAh బడా బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ధర వద్ద వన్ ప్లస్ 13R మిడ్-ప్రీమియం విభాగంలో అత్యుత్తమ డీల్‌లలో ఒకటి. ఇప్పుడు ఈ ఫోన్ ఆఫర్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
డిస్కౌంట్
ఈ ఆకట్టుకునే వన్ ప్లస్ పరికరం ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో రూ.38,010 కు లిస్ట్ అయింది. అంటే ఇది దాని లాంచ్ ధర కంటే రూ.4,619 చౌకగా ఉంటుంది. ఇంకా, ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్ కూడా పొందొచ్చు. SBI క్రెడిట్ కార్డ్‌లపై రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. అదనంగా,ఈ ఫోన్‌పై గొప్ప ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దీంతో ఈ పరికరం పై రూ.28,550 ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందవచ్చు. అంతేకాకుండా, రూ.1,880 నుండి ప్రారంభమయ్యే నెలవారీ EMIలతో కూడా కొనుగోలు చేయవచ్చు.
ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ వన్ ప్లస్ పరికరం 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 nits వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల 1.5K LTPO 4.1 అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8వ జెన్ 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 16GB వరకు LPDDR5x RAM, 512GB UFS 4.0 నిల్వతో జత చేశారు. ఫోటోగ్రఫీ పరంగా..ఫోన్ ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం, ఫోన్ 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.బ్యాటరీ గురించి మాట్లాడితే..ఈ ఫోన్ 6000mAh బిగ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. దీంతో ఒకరోజు మొత్తం సులభంగా వాడవచ్చు. ఈ పరికరం 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీని వలన ఇది త్వరగా ఛార్జ్ అవుతుంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


