Saturday, November 15, 2025
Homeటెక్నాలజీOnePlus 13R Discount: వన్ ప్లస్ 13R పై ఏకంగా రూ.7,250 డిస్కౌంట్..

OnePlus 13R Discount: వన్ ప్లస్ 13R పై ఏకంగా రూ.7,250 డిస్కౌంట్..

OnePlus 13R: వన్ ప్లస్ దీపావళి సేల్ సందర్భంగా వన్ ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఈ సంవత్సరం మార్కెట్లో లాంచ్ అయినా వన్ ప్లస్ ప్రీమియం ఫోన్ రూ.7,000 కంటే ఎక్కువ తగ్గింపును పొందుతోంది. కంపెనీ వెబ్‌సైట్ లో వన్ ప్లస్ 13R ఫోన్‌పై ఈ తగ్గింపును అందిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోన్ ఆఫర్, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

ఆఫర్:

కంపెనీ వన్ ప్లస్ 13R స్మార్ట్ ఫోన్ ను రూ.42,999కి పరిచయం చేసింది. అయితే ప్రస్తుతం ఇది కంపెనీ వెబ్ సైట్ లో కేవలం రూ.37,999కి జాబితాచేశారు. అదనంగా, దీనిపై రూ.2,250 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ పరికరం రూ.35,749కి తగ్గుతుంది. అంతేకాదు, దీనిపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. పాత ఫోన్‌ను మార్చుకుంటే, ఏకంగా రూ.15,000 వరకు తగ్గింపు పొందవచ్చు. కాకపోతే, పాత ఫోన్ మంచి కండిషన్, మోడల్‌పై కూడా ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి.

also read:Samsung: కొత్త కలర్‌ వేరియంట్‌లలో గెలాక్సీ A56, గెలాక్సీ A36..వివరాలివే..

ఫీచర్లు:

వన్ ప్లస్ 13R స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ప్రోఎక్స్‌డిఆర్ అమోలేడ్ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ స్క్రీన్ HDR మద్దతు స్పష్టమైన పిక్చర్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో ఏఐ ఫీచర్లు, గ్లోవ్ మోడ్, ఆక్వా టచ్ 2.0 వంటి సాంకేతికతలు అందించారు. ఈ పరికరం హై-ఎండ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది, ఇది ముఖ్యంగా గేమింగ్, మల్టీ టాస్కింగ్‌లో అత్యుత్తమ CPU, GPU పనితీరును అందిస్తుంది. ఇది 12GB/16GB RAM, 256GB/512GB UFS నిల్వ ఎంపికలలో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే, 50MP సోనీ LYT-700 ప్రధాన సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. ఈ కెమెరా 3x ఆప్టికల్ జూమ్, OIS, ఏఐ కెమెరా ఫీచర్‌లతో వస్తుంది. ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 6000mAh బిగ్ బ్యాటరీతో 55W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

 

నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad