Realme P3 Lite 5G: మీరు చాలారోజులుగా రూ.10000 బడ్జెట్ లోపు మంచి 5G ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్! ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మీ కోసం ఒక గొప్ప ఆఫర్‌ను అందిస్తుంది. స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ ఇటీవల విడుదల చేసిన రియల్‌మీ పి3 లైట్ 5జి స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. కంపెనీ మొదట్లో ఈ ఫోన్‌ను దాదాపు రూ.12,999 ధరకు మార్కెట్లో రిలీజ్ చేసిన ఇప్పుడు బ్యాంక్ ఆఫర్‌లను వర్తింపజేసిన తర్వాత రూ.10,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఈ ఫోన్ పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇది ధరను మరింత తగ్గిస్తుంది. ఇప్పుడు ఫోన్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఆఫర్
కంపెనీ రియల్‌మీ పి3 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో రూ.12,999 కు లాంచ్ చేసింది. కానీ, ప్రస్తుతం ఈ పరికరాన్ని ఎటువంటి బ్యాంక్ ఆఫర్‌లు లేకుండా కేవలం రూ.10,499కే కొనుగోలు చేయవచ్చు. దీంతో రూ.2,500 ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది. అదనంగా, కంపెనీ ఈ ఫోన్ పై ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్‌తో రూ.750 తగ్గింపు పొందవచ్చు. దీని వలన ఫోన్ ధర రూ.10,000 కంటే తక్కువకు తగ్గుతుంది. అంతేకాకుండా ఫోన్‌పై గొప్ప రూ.9,350 ఎక్స్ఛేంజ్ వాల్యూ కూడా ఉంది. కాకపోతే, ఎక్స్ఛేంజ్ విలువ పూర్తిగా పాత ఫోన్ కండిషన్, మోడల్ పై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి.
ఫీచర్లు
ఈ ఆకట్టుకునే రియల్‌మీ ఫోన్ ఫీచర్లలో పంచ్-హోల్ డిజైన్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో 6.67-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. ఫోన్ 4GBRAM,128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కూడా కలిగి ఉంది. ఈ ధర వద్ద ఈ పరికరం అల్ట్రా-స్లిమ్, అల్ట్రా-లైట్ డిజైన్‌కు ప్రసిద్ధి చెందింది. ఈ ఫోన్ మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. రియల్‌మీ పి3 లైట్ 5జి మీడియాటెక్ 6300 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. కెమెరా గురించి మాట్లాడితే, ఇది శక్తివంతమైన 32-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ ముందు కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రత్యేక ఫీచర్ ఏంటంటే, ఇది 6000mAh బడా బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.


