Saturday, November 15, 2025
Homeటెక్నాలజీDiscount: రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 5G పై కళ్ళు చెదిరే ఆఫర్..లాంచ్ ధర...

Discount: రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 5G పై కళ్ళు చెదిరే ఆఫర్..లాంచ్ ధర కంటే రూ.8000 తక్కువ!

Redmi Note 13 Pro Plus 5G Discount: మీరు అద్భుతమైనా పనితీరు, గొప్ప కెమెరా, శక్తివంతమైన డిస్‌ప్లేను అందించే శక్తివంతమైన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్. రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అలాగే బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో దీన్ని మరింత చౌకగా కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

Redmi Note 13 Pro Plus 5G ఆఫర్:
లాంచ్ సమయంలో ఈ పరికరం అసలు ధర రూ.34,999. కానీ, ప్రస్తుతం ఈ ఫోన్ రూ.8000 డైరెక్ట్ డిస్కౌంట్‌తో అమ్ముడవుతోంది. డిస్కౌంట్ తర్వాత ఫోన్‌ను కేవలం రూ.26,999కి సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్ తో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే, రూ. 1300 అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. దీనితో పాటు, పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ పై రూ. 20,000 తగ్గింపు పొందవచ్చు. ఒకవేళ EMI ఎంపికను ఎంచుకుంటే, దాని నెలవారీ చెల్లింపు రూ. 1,322 నుండి ప్రారంభమవుతుంది.

ALSO READ:Smart phones: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలా..? రూ.10 వేల లోపు లభించే టాప్ 5G స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

Redmi Note 13 Pro Plus 5G ఫీచర్లు:

ఈ పరికరం 6.67-అంగుళాల కర్వ్డ్ అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో వస్తుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ నుండి రక్షణను కలిగి ఉంటుంది. ఇది ఫోన్ ను మరింత మన్నికైనదిగా చేస్తుంది. పనితీరు గురించి చెప్పాలంటే..ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్ ను అమర్చారు. ఇది గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు గొప్పది. దీనికి 12GB వరకు RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ఉంది.

ఈ ఫోన్ కెమెరా విభాగంలో వినియోగదారులకు ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. దీనికి OIS సపోర్ట్‌తో 200MP ప్రైమరీ కెమెరా ఉంది. దానితో పాటు 8MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో కెమెరా అందుబాటులో ఉన్నాయి. ఇక సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం..16MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ బ్యాటరీ, ఛార్జింగ్ పరంగా అద్భుతంగా ఉంటుంది. దీనికి 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది 120W సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad