SAMSUNG GALAXY A 55 5G DISCOUNT: అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 కొనసాగుతోంది. ఈ సేల్ ఎలక్ట్రానిక్స్ నుండి ఇంటికి అవసరమైన వస్తువుల వరకు అనేక రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో అత్యంత ముఖ్యమైన డీల్స్ స్మార్ట్‌ఫోన్‌లపై ఉన్నాయి. కొనుగోలుదారులు తక్కువ ధరకే ప్రసిద్ధ మోడళ్లను కొనుగోలు చేయడానికి ఈ సేల్ గొప్ప అవకాశం. ఈ క్రమంలోనే శామ్‌సంగ్ గెలాక్సీ A55 5G పై సూపర్ డీల్ అందుబాటులో ఉంది. ఆఫర్ లో భాగంగా ఇప్పుడు దీని రూ.16,000కే భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.
శామ్‌సంగ్ గెలాక్సీ A55 5G డీల్:
కంపెనీ శామ్‌సంగ్ గెలాక్సీ A55 5G పరికరాన్ని ఇండియాలో రూ.39,999 ప్రారంభ ధరకు పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ అమెజాన్ ఇండియాలో రూ.23,999కి లిస్ట్ అయింది. కస్టమర్ల ఈ-కామర్స్ దిగ్గజం తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా గెలాక్సీ A55 5G పై రూ.16,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాదు, పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా ఇంకా ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. కస్టమర్లు ఎక్స్ఛేంజ్‌లో రూ.22,750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ A55 5G ఫీచర్లు:
ఈ పరికరం 120Hz రిఫ్రెష్ రేట్, 1000 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.6-అంగుళాల FHD+ సూపర్ అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఎక్సినోస్ 1480 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ శామ్ సంగ్ 12GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం, గెలాక్సీ A55 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రధాన సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీలు,వీడియో కాల్స్ కోసం..32MP కెమెరా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే, ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది.


