Samsung Galaxy S25: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శామ్‌సంగ్ త్వరలో తన కొత్త శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 26 సిరీస్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ ఈ సంవత్సరంలో లాంచ్ అయినా శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 పై భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది. అమెజాన్ ప్రస్తుతం ఫోన్‌పై గణనీయమైన తగ్గింపును అందిస్తోంది. శామ్‌సంగ్ అత్యంత కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ పరికరాల్లో ఈ ఫోన్ ఒకటి. ఈ ఫోన్ పై క్రెడిట్ కార్డు ఆఫర్లు, ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ డిస్కౌంట్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 డిస్కౌంట్:
కంపెనీ శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 పరికరాన్ని మార్కెట్లో రూ.80,999 ప్రారంభ ధరకు లాంచ్ చేసింది. అయితే, ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ రూ.63,690కి లిస్ట్ అయింది. అంటే, ఇది దాని అసలు లాంచ్ ధర నుండి నేరుగా రూ.17,309 తగ్గింపు పొందుతోంది. అంతేకాదు, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీతో ఫోన్‌పై అదనంగా రూ.3,000 తగ్గింపును పొందవచ్చు. దీని వలన ప్రభావవంతమైన ధర కేవలం రూ.60,690కి వస్తుంది. దీంతో ఈ ఫోన్ పై ఏకంగా రూ.20,000 కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తోంది. ఇక్కడితో పూర్తికాకుండా ఈ ఫోన్ పై రూ.44050 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. కాకపోతే, ఎక్స్ఛేంజ్ విలువ పాత ఫోన్ కండిషన్, మోడల్ పై ఆధారపడి ఉంటుంది.
also read:Airtel: ఎయిర్‌టెల్ కస్టమర్లకు బిగ్ షాక్..ఆ చౌకైన రీఛార్జ్ ప్లాన్ నిలిపివేత!
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 స్పెసిఫికేషన్లు:
ఫీచర్ల విషయానికి వస్తే..ఈ శామ్‌సంగ్ పరికరం 6.2-అంగుళాల FHD+ అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది అడాప్టివ్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఈ పరికరం శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 12GB RAM+512GB వరకు అంతర్గత నిల్వతో జత చేయబడింది. ఈ ఫోన్ ప్రస్తుతం తాజా ఆండ్రాయిడ్ 16 ఆధారంగా One UI 8ని అమలు చేస్తుంది. ఈ పరికరం అనేక గెలాక్సీ ఏఐ ఆధారిత ఫీచర్‌లకు కూడా మద్దతు ఇస్తుంది. ఫోటోగ్రఫీ కోసం.ఈ పరికరం OISతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌తో కూడిన ట్రిపుల్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. బ్యాటరీ గురించి మాట్లాడితే.. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4000mAh బ్యాటరీని కలిగి ఉంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


