Samsung Galaxy Z Flip 6 5G Deal: కొత్త ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఈ వార్త మీకోసమే! Samsung Galaxy Z Flip 6 5G ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంటుతో అందుబాటులో ఉంది. అన్ని డిస్కౌంట్‌లతో తర్వాత దీని దాదాపు రూ.69వేల ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ పరికరం భారతదేశంలో లాంచ్ సమయంలో 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 1,09,999గా, 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్ రూ. 1,21,999కి లాంచ్ అయింది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 5G డీల్ ఎలా పొందాలో వివరంగా తెలుసుకుందాం.
Samsung Galaxy Z Flip 6 5G ఆఫర్ ధర:
ఈ ఫోన్ 256GB స్టోరేజ్, మింట్, సిల్వర్ షాడో కలర్ వేరియంట్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 72,999 ధరతో జాబితా చేయబడింది. బ్యాంక్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీన్ని రూ. 69,349 ప్రభావవంతమైన ధరకు కొనుగోలు చేయవచ్చు. అంటే లాంచ్ ధర కంటే రూ. 40,650 తక్కువకు ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
Also Read: Googgle Pixel 8a: Google Pixel 8aపై ఫ్లిప్ కార్ట్ బిగ్ డీల్..ఇప్పుడు కేవలం రూ. 37,999కే
Samsung Galaxy Z Flip 6 5G ఫీచర్లు:
ఈ ఫోన్ 3.4-అంగుళాల సూపర్ AMOLED కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 60 Hz, 306 ppi పిక్సెల్ సాంద్రత కలిగి ఉంది. లోపలి భాగంలో ఇది 6.7-అంగుళాల ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్ డైనమిక్ AMOLED 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 1 Hz నుండి 120 Hz మధ్య ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 256GB , 512GB స్టోరేజ్ ఎంపికలలో వస్తుంది. కాగా, రెండూ 12GB RAMని కలిగి ఉంటాయి. ఈ ఫోన్ Galaxy AI ఫీచర్లకు కూడా మద్దతు ఇస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.. బయట ఫోన్‌లో డ్యూయల్ పిక్సెల్ ఆటోఫోకస్, OIS, f/1.8 అపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, f/2.2 అపర్చర్, 123-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. లోపల f/2.2 అపర్చర్‌తో 10-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
బ్యాటర్ గురించి మాట్లాడితే.. ఫోన్‌లో 4000mAh బ్యాటరీ ఉంది. 25W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 68 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయాన్ని, 23 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందించగలదని కంపెనీ చెబుతోంది.
కనెక్టివిటీ పరంగా.. ఫోన్‌లో 5G, 4G, Wi-Fi 6E, బ్లూటూత్ వెర్షన్ 5.3, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇది దుమ్ము, నీటి నుండి రక్షించబడటానికి IP48 రేటింగ్‌తో వస్తుంది. దీని కొలతలు మడతపెట్టినప్పుడు 85.1×71.9×14.9mm. ఓపెన్ చేసినప్పుడు 165.1×71.9×6.9mm. బరువు 187 గ్రాములు.


