Amazon Great Indian Festival Sale: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 కోసం అమెజాన్ ఇప్పటికే సిద్ధం అయింది. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సేల్ లో కస్టమర్లు అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందుకుంటారు. ఎలక్ట్రానిక్స్ నుండి గృహోపకరణాల వరకు, ఫ్యాషన్ నుండి రోజువారీ వినియోగ వస్తువుల వరకు ప్రతి కేటగిరీలో ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అయితే, అందరి దృష్టి స్మార్ట్‌ఫోన్‌లపై ఉంటుంది. ఈ సేల్‌లో హైలైట్ ఏంటంటే? శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 పై ఉన్న డిస్కౌంట్. ఇది భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంటుంది.
ఈ సంవత్సరం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కంపెనీ శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6పై ఇప్పటివరకు అతిపెద్ద ఆఫర్‌ను ప్రకటించింది. ఫోల్డబుల్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి, ఈ అవకాశం చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఈ ఫోన్‌లో రూ.54,000 వరకు పొదుపు లభిస్తుందని అమెజాన్ ధృవీకరించింది. దీని ధర గణనీయంగా తగ్గి మరింత సరసమైనదిగా మారింది.
also read:SmartPhone Exchange: అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్..పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తున్నారా..?
శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ఫోల్డబుల్ ఫోన్: డీల్
శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ఫోల్డబుల్ ఫోన్ ఇండియాలో రూ.1,64,999 కు లాంచ్ అయింది. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో ఈ ఫోన్‌ను కేవలం రూ.1,10,999 కు కొనుగోలు చేయవచ్చు. అంటే..కస్టమర్లు మొత్తం రూ.54,000 ఆదా చేస్తారు.
శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ఫోల్డబుల్ ఫోన్: ఫీచర్లు
శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ఫోల్డబుల్ ఫోన్ 7.6-అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 6.3-అంగుళాల ఔటర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. రెండూ డైనమిక్ అమోలేడ్ 2X ప్యానెల్‌లు, 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తాయి. పనితీరు కోసం ఈ పరికరంలో స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ను అమర్చారు. ఇక కెమెరా సెటప్‌లో ఇది ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో OIS సపోర్ట్‌తో 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం..10MP ఫ్రంట్ కెమెరాను అందించారు. బ్యాటరీ పరంగా ఈ ఫోన్ 4400mAh డ్యూయల్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 25W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


