Samsung Galaxy Z Fold 6: చాలారోజుల నుంచి ఫోల్డబుల్ లేదా ఫ్లిప్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్! ఫ్లిప్‌కార్ట్ గొప్ప డీల్‌ను అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఇది నవంబర్ 5 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్ ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ఆఫర్‌తో లిస్ట్ అయింది. ఇంకా, ఈ ఫోన్ కొనుగోలు పై బ్యాంక్ ఆఫర్‌లు, ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్ ఆఫర్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
డిస్కౌంట్
శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్ అసలు ధర ర్.1,64,999. అయితే, ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ సమయంలో దీన్ని కేవలం రూ.1,03,999 కు కొనుగోలు చేయవచ్చు. ఇంకా, కంపెనీ గొప్ప బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఏకంగా రూ.4,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీని వలన ధర రూ.1 లక్ష కంటే తక్కువకు తగ్గుతుంది. అదనంగా, దీనిపై గొప్ప ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇది దాదాపు రూ.56,600 వరకు తగ్గింపును అందిస్తుంది. అయితే, ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పూర్తిగా పాత ఫోన్ కండిషన్, మోడల్ పై ఆధారపడి ఉంటుంది.
ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే..శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్‌లో 6.3-అంగుళాల అమోలేడ్ ఔటర్ స్క్రీన్, 7.6-అంగుళాల అమోలేడ్ ఇన్నర్ ప్యానెల్ ఉన్నాయి. రెండు స్క్రీన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తాయి. పరికరం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతాయి. ఇది గరిష్టంగా 12GBRAM+512GB నిల్వతో జత చేశారు. కెమెరా విభాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ఇది 10-మెగాపిక్సెల్, 4-మెగాపిక్సెల్ సెన్సార్‌లను కలిగి ఉంది. బ్యాటరీ గురించి మాట్లాడితే..ఈ ఫోన్ 4400mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.


