Vivo T4 Lite 5G Discount: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? అది కూడా కేవలం రూ. 10,000 బడ్జెట్‌లో గొప్ప 5G స్మార్ట్‌ఫోన్! అయితే మీకో గుడ్ న్యూస్. వివో T4 లైట్ 5G పరికరంపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆఫర్ లో భాగంగా దీని ఇప్ప్పుడు రూ. 9,999 కు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ లో బిగ్ బ్యాటరీ మాత్రమే కాకుండా, డ్యూయల్ రియర్ కెమెరా, అనేక గొప్ప ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఆలస్యమెందుకు ఈ ఫోన్ పై ఉన్న ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Vivo T4 Lite 5Gపై డిస్కౌంట్ ఆఫర్:
కంపెనీ వివో T4 లైట్ 5G పరికరాన్ని రూ. 13,999కు పరిచయం చేసింది. కానీ ఆఫర్ లో భాగంగా దీని ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 9,999కి కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాదు, కంపెనీ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5% అదనపు క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది, తద్వారా పరికరాన్ని మరింత చౌకగా కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు, ఫోన్‌లో నో కాస్ట్ EMI ఎంపిక కూడా అందుబాటులో ఉంది. దీంతో నెలవారీ వాయిదాలో రూ.3,333 చెల్లించి కూడా ఈ ఫోన్‌ను స్వంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. పాత పరికరాన్ని ఎక్స్ఛేంజ్ చేస్తే దాదాపు రూ.1500 నుండి రూ.2000 లేదా అంతకంటే ఆదా చేయొచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ పాత ఫోన్ బ్రాండ్, కండిషన్ బట్టి ఉంటుంది.
Also Read:
SmartPhones: 7000mAh బ్యాటరీతో చౌకైన 5G ఫోన్లు..ధర కేవలం రూ. 17,999 నుంచి ప్రారంభం!
Vivo T4 Lite 5G ఫీచర్స్:
ఈ పరికరంలో 6.74-అంగుళాల HD ప్లస్ LCD డిస్ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఫోన్ గరిష్ట ప్రకాశం 1000 నిట్‌లు, అంటే ఫోన్ స్క్రీన్ పగటిపూట కూడా బాగా కనిపిస్తుంది. ఈ పరికరం శక్తివంతమైన మీడియాటెక్ 6300 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 8GB RAM+ 256GB వరకు నిల్వను పొందుతుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ రియల్ కెమెరా, 2-మెగాపిక్సెల్ సెకండ్ కెమెరాను అందించారు. ఇదే సమయంలో ముందు భాగంలో సెల్ఫీల కోసం 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను తీసుకొచ్చారు. బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీతో 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది. కెమెరా పరంగా కూడా ఫోన్ చాలా అద్భుతంగా ఉంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


