Vivo X100 Pro Discount: మీరు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? రూ. లక్ష కంటే తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లను అందించే ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త కోసమే. వివో X100 ప్రో ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో దాదాపు రూ.27,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ. 89,999 ధరకు లాంచ్ అయిన ఈ పరికరం ఇప్పుడు కేవలం రూ.63,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు డీల్స్, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
డీల్:
అమెజాన్ ఇండియాలో వివో X100 ప్రో రూ.63,999కి లిస్ట్ అయింది. అదనంగా, కొనుగోలుదారులు SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1,250 వరకు తక్షణ తగ్గింపును పొందుతారు. దీంతో ఈ ఫోన్ ధర ధర రూ.62,749కి తగ్గుతుంది. అమెజాన్ ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై నో-కాస్ట్ EMI ఎంపికలను కూడా అందిస్తోంది. ఫోన్ పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దీని ద్వారా కస్టమర్లు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ ఛేంజ్ చేసి రూ.51,650 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ డీల్ 16GB ర్యామ్+512GB స్టోరేజ్ ఆస్టరాయిడ్ బ్లాక్ వేరియంట్‌కు మాత్రమే పరిమితం చేశారు.
ఫీచర్లు:
వివో X100 ప్రో ఫీచర్ల విషయానికి వస్తే, ఈ పరికరం 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇచ్చే 6.78-అంగుళాల LTPO కర్వ్డ్ అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ పరికరం మీడియాటెక్ డిమెన్సిటీ 9300 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లిస్ట్ అయింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్ 14 పై నడుస్తుంది. కెమెరా గురించి మాట్లాడితే, వివో ఫోటోగ్రఫీ కోసం ZEISS తో భాగస్వామ్యం కలిగి ఉంది. X100 Pro OIS తో 50MP సోనీ IMX989 ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, OIS తో 50MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ఇది క్రిస్టల్-క్లియర్ జూమ్ షాట్‌లను అందిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఇది 100W ఫ్లాష్‌ఛార్జ్‌తో 5,400mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


