Oneplus 13s: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో దీపావళి సేల్ ముగిసినప్పటికీ కొన్ని స్మార్ట్ ఫోన్స్ పై డిస్కౌంట్స్ అలానే ఉన్నాయి.
ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం కొన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప డిస్కౌంట్లను అందిస్తోంది. అత్యంత ముఖ్యమైన డీల్ వన్ ప్లస్ 13s పై ఉంది. కాంపాక్ట్ డిజైన్‌ను ఇష్టపడే వారికి, గొప్ప పనితీరు ఫోన్ కొనుకునేవారికి వన్ ప్లస్ 13s గొప్ప ఎంపిక అవుతుంది. ఇప్పుడు ఆఫర్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
వన్ ప్లస్ 13s డీల్:
కంపెనీ వన్ ప్లస్ 13s ఇండియాలో రూ.54,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ ఫోన్ (గ్రీన్ సిల్క్ (256 GB 12 GB RAM) వేరియంట్ ఫ్లిప్ కార్ట్ ఏకంగా రూ.5,010 ఫ్లాట్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. దీంతో ఈ ఫోన్ ధర రూ.49,989 వరకు తగ్గుతుంది. అదనంగా, కస్టమర్ అనేక బ్యాంక్ ఆఫర్‌లతో కూడా కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ వాల్యూ రూ.38,850 పొందవచ్చు. కాకపోతే, ఎక్స్ఛేంజ్ విలువ పూర్తిగా పాత ఫోన్ కండిషన్, మోడల్ పై ఆధారపడి ఉంటుంది.
వన్ ప్లస్ 13s ఫీచర్లు:
ఫీచర్ల విషయానికి వస్తే..వన్ ప్లస్ 13sపరికరం 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, 460ppi, 1,600 nits గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.32-అంగుళాల LTPO అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే డాల్బీ విజన్, HDR10 ప్లస్, HDR వివిడ్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని 12GB LPDDR5X RAM, 256GB/512GB UFS 4.0 స్టోరేజ్‌తో జత చేశారు.
ఫోటోగ్రఫీ గురించి చెప్పాలంటే..వన్ ప్లస్ 13s లో 50MP సోనీ LYT-700 సెన్సార్, OIS తో, 50MP (2X ఆప్టికల్ జూమ్) టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం..ఇది 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో ఈ ఫోన్‌లో Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, డ్యూయల్ సిమ్, USB టైప్-C, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్, IR రిమోట్, గైరోస్కోప్, ఇ-కంపాస్ వంటి ఫీచర్లు కలిగి ఉంది. బ్యాటరీ గురించి మాట్లాడితే..ఈ కాంపాక్ట్ ఫోన్ 5,850mAh బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.


