Flipkart goat sale deals: ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లతో గోట్ సేల్ ను ప్రారంభించింది. జులై 11 నుంచి 17 వరకు జరిగే ఈ సేల్ జరగనుంది. ఇప్పటికే ఈ సేల్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ సేల్ లో అనేక ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. ఇందులో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు ఆపిల్ ఐఫోన్ 16, శామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
ఆపిల్ ఐఫోన్ 16
ఆఫర్
గత ఏడాది సెప్టెంబర్ లో ఆపిల్ ఐఫోన్ 16 రూ. 79,999 కు మార్కెట్లో విడుదల అయింది. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లతో గోట్ సేల్ సమయంలో రూ. 69,999 (128GB)కి అందుబాటులో ఉంటుంది. అంటే ఫ్లాట్ రూ. 10,000 తగ్గింపును అందిస్తుంది. ఈ మోడల్ 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్‌లలో కూడా కొనుగోలుకు ఉంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించే కస్టమర్‌లు త్రైమాసికానికి రూ. 4,000 వరకు 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో భాగంగా పాత పరికరాన్ని బట్టి రూ. 46,150 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
ఫీచర్లు
డిస్ప్లే: 460 ppi, 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. 2,000 నిట్‌ల వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 1-అంగుళాల XDR సూపర్ రెటినా OLED ఉంది.
బిల్డ్: ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం బాడీ, సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్, IP68 నీరు, ధూళి నిరోధకత
కెమెరాలు: డ్యూయల్ రియర్ సెటప్, 48MP వెడల్పు (f/1.6, 2x టెలిఫోటో) + 12MP అల్ట్రా-వైడ్ (f/2.2); ఆటోఫోకస్‌తో 12MP ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా ఉంది.
పనితీరు: Apple A18 ప్రాసెసర్ ద్వారా ఆధారితం. సిస్టమ్-వైడ్ Apple ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు మద్దతు ఇస్తుంది.
AI ఇంటిగ్రేషన్: స్మార్ట్ సిరి, AI ఇమేజ్ ఎడిటింగ్, వ్యక్తిగత సూచనలు వంటి అనేక AI ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.
Also Read:Air conditioners: అమెజాన్‌లో ఈ ఏసీలపై బంపర్ ఆఫర్లు..ఇప్పుడే కోనేయండి..
Samsung Galaxy S24 Ultra
ఆఫర్
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా అసలు ధర రూ.1,34,999. ఎలాంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా రూ.82,288కి అందుబాటులో ఉంటుంది. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే రూ.4,000 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. దీంతో ఈ పరికరం ధర రూ.78,288కి తగ్గుతుంది. అంటే రూ.56,000 కంటే ఎక్కువ ఆదా అవుతుంది.
ఫీచర్లు
డిస్ప్లే: 120Hz రిఫ్రెష్ రేట్‌తో 8-అంగుళాల AMOLED LTPO డిస్ప్లే.
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3, ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్‌లో అత్యంత శక్తివంతమైన చిప్‌సెట్‌లలో ఒకటి.
మెమరీ: 12GB RAM , 512GB నిల్వ వరకు.
బ్యాటరీ: 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ.
కెమెరాలు: క్వాడ్-కెమెరా సెటప్ — 200MP ప్రధాన సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్, 5x జూమ్‌తో 50MP పెరిస్కోప్, 3x జూమ్‌తో 10MP టెలిఫోటో. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 12MP ఫ్రంట్ కెమెరా.
నోట్: స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


