Saturday, November 15, 2025
HomeTop StoriesSecurity Cameras Discounts: అదిరే ఆఫర్లు.. చీప్ ధరకే ఇంటి కోసం హై సెక్యూరిటీ కెమెరాలు..డోంట్...

Security Cameras Discounts: అదిరే ఆఫర్లు.. చీప్ ధరకే ఇంటి కోసం హై సెక్యూరిటీ కెమెరాలు..డోంట్ మిస్..

Amazon Great Indian Festival Sale: ప్రస్తుతం అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 జరుగుతోంది. పండగ సీజన్ సందర్భంగా ఈ సేల్‌లో లక్షలాది మంది వినియోగదారులు ఎలక్ట్రానిక్ వస్తువులు నుంచి ఇతర గృహోపకర పరికరాల వరకు కొనుగోలు చేస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు పండుగ సీజన్‌కు ముందుగానే అమెజాన్ ఎన్నో ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటించింది.

- Advertisement -

అయితే, చాలామంది పండుగ సందర్బంగా సిటీ నుంచి సొంతూరికి వెళ్తుంటారు. ఈ సమయంలో ఇంటిని విడిచి వెళ్తే, సెక్యూరిటీ సమస్యలు తలెత్తవచ్చు. ఇంటి భద్రత విషయంలో ముందు చూపు చాలా అవసరం. ఈ క్రమంలో ఇంటికి, ఆఫీస్‌లకు సెక్యూరిటీ కెమెరాలు అనేవి ఎంతో ముఖ్యం. ఇంటికి భద్రతను పెంచాలని చూస్తున్నట్లయితే, ప్రస్తుతం జరుగుతోన్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ లో సెక్యూరిటీ కెమెరాల కొనుగోలు చేయడం ప్రయోజనకరం.

also read:SmartPhones Under 10K: కొత్త ఫోన్ కొనాలా..? కేవలం రూ.10 వేల లోపు లభించే స్మార్ట్ ఫోన్లు.. లిస్ట్ ఇదే..

ప్రముఖ బ్రాండ్‌లు తమ బెస్ట్ సెల్లింగ్, లేటెస్ట్ సెక్యూరిటీ కెమెరాలపై 85 శాతం వరకు తగ్గింపును అందిస్తున్నాయి. అంతేకాకుండా, బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్స్, కూపన్ ఆధారిత డిస్కౌంట్లతో మరింత ఆకర్షణీయంగా మారుతాయి. ఈ సేల్ లో CP Plus, TP-Link, Qubo వంటి బ్రాండ్ల నుండి టాప్-రేటెడ్ సెక్యూరిటీ కెమెరాలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇండోర్ మానిటరింగ్, అవుట్‌డోర్ సర్వైలెన్స్‌కు అనువైన అనేక మోడల్‌లు బడ్జెట్ ధరలో కొనుగోలుకు ఉన్నాయి. అయితే, కొన్ని సెక్యూరిటీ కెమెరాలు మోషన్ డిటెక్షన్, క్లౌడ్ స్టోరేజ్, యాప్ పెయిరింగ్, నైట్ విజన్ వంటి స్మార్ట్ ఫీచర్‌లను అందిస్తాయి.

Tapo C200 360° కెమెరా ధర రూ. 3,299 ఉండగా, ఈ సేల్‌లో డిస్కౌంట్‌తో కేవలం రూ.1,199లకే కొనుగోలు చేయవచ్చు. అలాగే, Trueview WiFi 3mp Mini Pan-Tilt Zoom CCTV Camera ధర రూ.14,000 ఉంటె, రూ. 2, 999కే లభిస్తుంది. ఇక Trueview 3+3Mp 4G Mini కెమెరా ధర రూ. 15,000 కాగా డిస్కౌంట్‌తో రూ. 7, 649లకే లభిస్తుంది. ప్రత్యేక విశేయం ఏంటంటే? SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై కొనుగోలుదారులు 10 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాదు, అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే, మరింత డిస్కౌంట్లు అందుకోవచ్చు. వీటిపై నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. ఇక ఇతర పరికరాల డిస్కౌంట్ల విషయానికి వస్తే, ఈ సేల్ రూ. 60,000 లోపు డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ల్యాప్‌టాప్‌లపై కొన్ని మంచి డీల్స్‌ ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad