Saturday, November 15, 2025
Homeటెక్నాలజీDiscount: వన్ ప్లస్ 13R పై సూపర్ డిస్కౌంట్.. ఇప్పుడు ఎంతంటే..?

Discount: వన్ ప్లస్ 13R పై సూపర్ డిస్కౌంట్.. ఇప్పుడు ఎంతంటే..?

One Plus 13R Discount: టెక్ ప్రియులు, బడ్జెట్-స్నేహపూర్వక వినియోగదారులు ఇష్టపడే స్మార్ట్‌ఫోన్‌లలో పనే ప్లస్ 13R ఒకటి. ఈ ఫోన్ లో శక్తివంతమైన ప్రాసెసర్, మృదువైన 120Hz OLED డిస్ప్లే, 50MP కెమెరా సెటప్, 6000mAh బిగ్ బ్యాటరీ వంటి ఫ్లాగ్‌షిప్-స్థాయి స్పెసిఫికేషన్‌లతో వస్తుంది. అయితే, వన్ ప్లస్ 13R ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు తో లిస్ట్ అయింది. ఇప్పుడు ఈ ఫోన్ ఆఫర్, ఫీచర్ల వివరాల గురించి చూద్దాం.

- Advertisement -

OnePlus 13R ఆఫర్:

వన్ ప్లస్ 13R 5G 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ ధర రూ.42,999. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో దీని ప్రస్తుతం రూ.3729 ప్రత్యక్ష తగ్గింపు తర్వాత రూ.39,270కె సొంతం చేసుకోవచ్చు. కస్టమర్లు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీన్ని చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే, రూ. 1,996 తగ్గింపు లభిస్తుంది. తద్వారా ఫోన్‌ను రూ. 37,301 కు కొనుగోలు చేయవచ్చు. ఇదే సమయంలో పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ పై రూ. 20,000 వరకు తగ్గింపు పొందవచ్చు. కాగా, ఈ తగ్గింపు పూర్తిగా పాత ఫోన్ కండిషన్ , బ్రాండ్ పై ఆధారపడి ఉంటుంది.

Also Read:Lava Play Ultra 5G: గేమింగ్ అంటే ఇష్టమా..? లావా ప్లే అల్ట్రా వచ్చేసింది..ధర కూడా చాలా తక్కువే!

OnePlus 13R ఫీచర్లు:

ఈ ఫోన్ 6.78-అంగుళాల ప్రీమియం OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 2780×1264 రిజల్యూషన్‌తో 120Hz ప్రమోషన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది రంగు, కాంట్రాస్ట్, వీడియో/గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఫోన్ IP65 రేటింగ్‌ను కలిగి ఉంది, ఇది నీరు మరియు ధూళి నుండి రక్షిస్తుంది. పనే ప్లస్ 13R 5G అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది LPDDR5X RAM, UFS 4.0 నిల్వతో వస్తుంది. ఈ కాంబినేషన్ వేగవంతమైన లోడింగ్, మృదువైన మల్టీ టాస్కింగ్, హై-ఎండ్ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

కెమెరా విషయానికి వస్తే, ఇందులో మూడు వెనుక కెమెరాలు. 50MP ప్రైమరీ, 8MP అల్ట్రా-వైడ్, 50MP టెలిఫోటో (2×) సెటప్ ఉన్నాయి. ఇక ముందు భాగంలో 16MP కెమెరా ఉంది. ఇది సెల్ఫీలు, వీడియో కాల్‌లను మెరుగ్గా చేస్తుంది. ఈ ఫోన్‌ 6000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఒకే ఛార్జ్‌పై పూర్తి రోజు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఉంటుంది. ఇందులో సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. ఇది ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేస్తుంది.

ఈ పరికరం ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆక్సిజన్ OS 15ని పొందుతుంది. కంపెనీ నాలుగు సంవత్సరాల OS అప్‌డేట్‌లు, ఆరు సంవత్సరాల భద్రతా మద్దతును హామీ ఇస్తుంది. దీనితో పాటు, ఇందులో స్టీరియో స్పీకర్లు, USB-C పోర్ట్, సైడ్ ఫింగర్ ప్రింట్ యాక్సెస్, ప్లస్ మైండ్, రిఫైన్ షాట్ వంటి AI ఫీచర్లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad