టెక్నాలజీ రోజుకో కొత్త పంథాలో పయనిస్తోంది. ఏఐ సాంకేతికతను ఉపయోగించుకుంటూ రకరకాల టూల్స్ రంగప్రవేశం చేస్తున్నాయి. ఈ కోవలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఘిబ్లీ. ఇది ఇక జపనీస్ యానిమేషన్ స్టూడియో టెక్నాలజీ. ఈ యానిమే టెక్నాలజీని ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ ఏఐ తన చాట్ జీపీటీ ద్వారా అందిస్తోంది. దీన్ని జీపీటీ 4ఓ అని పిలుస్తారు.
ఇప్పుడు ఎవరైనా ఈ టూల్ సాయంతో తమ ఫొటోలను ఘిబ్లీ స్టయిల్లోకి మార్చుకోవచ్చు. ఓ కార్టూన్ లేదా యానిమే తరహాలో వారి ఫొటోలు దర్శనమిస్తాయి. టెక్ ప్రపంచంలో ఇప్పుడీ ట్రెండే నడుస్తోంది.
తాజాగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ కూడా తన ఫొటోలను, తన ఫ్యామిలీ ఫొటోలను ఘిబ్లీ స్టయిల్లోకి మార్చుకున్నారు. ఆ ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఘిబ్లిఫైడ్ గ్యాంగులో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని క్యాప్షన్ కూడా ఇచ్చారు.