Sunday, March 30, 2025
Homeటెక్ ప్లస్Banking Rules: ఏప్రిల్ 1 నుంచి బ్యాంకింగ్ రూల్స్ మార్పు.. చార్జీల కోతలు మొదలు

Banking Rules: ఏప్రిల్ 1 నుంచి బ్యాంకింగ్ రూల్స్ మార్పు.. చార్జీల కోతలు మొదలు

మీకు బ్యాంక్ ఖాతా ఉందా, అయితే ఇది తెలుసుకోవాల్సిందే. ఏప్రిల్ 1, 2025 నుంచి, దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సంబంధిత నియమాలు మారిపోతున్నాయి, ఇవి మీ పొదుపు ఖాతాలు, క్రెడిట్ కార్డులు, ATM లావాదేవీలపై స్పష్టమైన ప్రభావం చూపిస్తాయి. ఈ మార్పులు మీకు నష్టాన్ని కలిగించకుండా ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం.

- Advertisement -

ఏటీఎమ్ విత్‌డ్రా పరిమితులు: ప్రస్తుతం, మనం ఒకే ATM నుంచి అనేక సార్లు డబ్బు విత్‌డ్రా చేసుకుంటున్నాము. కానీ, ఏప్రిల్ 1 నుంచి, ఇతర బ్యాంకుల ATMల నుంచి ఉచిత విత్‌డ్రా పరిమితి 3 సార్లకు పరిమితం అవుతుంది. 3 సార్ల తర్వాత, మీరు ప్రతి లావాదేవి కోసం 20 నుంచి 25 రూపాయల వరకు సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

డిజిటల్ బ్యాంకింగ్ లో మార్పులు: డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించడానికి బ్యాంకులు చాట్‌బాట్‌లు, ఏఐ, టూ స్టెప్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ ధృవీకరణ వంటి కొత్త ఫీచర్లను జోడిస్తున్నాయి. ఇవి లావాదేవీల భద్రతను పెంచేందుకు సహాయపడతాయి.

కనీస బ్యాలెన్స్ నియమాలు: కనీస బ్యాలెన్స్ పరిమితి పలు బ్యాంకులలో మారింది. ఈ బ్యాలెన్స్ మీ బ్యాంకు ఖాతా ప్రాంతం ఆధారంగా ఉంటుంది. కనీస బ్యాలెన్స్ కంటే తక్కువ ఉంటే, మీరు జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

వడ్డీ రేట్లలో మార్పులు: పొదుపు ఖాతాలు, FD లపై వడ్డీ రేట్లు బ్యాలెన్స్ ఆధారంగా మారతాయి. బ్యాలెన్స్ పెరిగే కొద్దీ, వడ్డీ రేట్లు మెరుగవుతాయి. ఈ మార్పులు మీ బ్యాంకింగ్ అనుభవాన్ని ప్రభావితం చేయవచ్చు, కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ నియమాలను తెలుసుకోవడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News