అందరూ ఊహించినట్టే చంద్రయాన్ 3 విజయవంతమయింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ వ్యోమ నౌక సురక్షితంగా దిగింది. యావత్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురు చూసిన ల్యాండిగ్ ప్రక్రియను ప్రధాని మోడీ కూడా చూసి, చప్పట్లు చరిచి, ఆనందం వ్యక్తం చేశారు. ల్యాండింగ్ ప్రక్రియ పూర్తవ్వగానే ఇండియా ఈజ్ ఆన్ ద మూన్ అంటూ ఇస్రో ప్రకటించింది. ఇస్రో శాస్త్రవేత్తలను మోడీతో సహా యావత్ భారత జాతి అభినందనలతో ముంచెత్తుతోంది.


