Saturday, November 15, 2025
Homeటెక్నాలజీInfinix Hot 60 5G+: అదిరే గేమింగ్ ఫీచర్లతో హాట్ 60 5G+ విడుదల..ధర కూడా...

Infinix Hot 60 5G+: అదిరే గేమింగ్ ఫీచర్లతో హాట్ 60 5G+ విడుదల..ధర కూడా తక్కువే!

Infinix Hot 60 5G+ launched: ఇండియాలో ఇన్ఫినిక్స్ సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ హాట్ 60 5G + పేరిట దీని రిలీజ్ చేసింది. బడ్జెట్ ధరలో ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికీ ఇది బెస్ట్ ఆప్షన్. అనేక ఆధునిక ఫీచర్లతో ఈ 5G పరికరాన్నికేవలం రూ. 10 వేల లోపు తీసుకురావడం విశేషం. ఈ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

- Advertisement -

 

ధర

ఈ స్మార్ట్ ఫోన్ 6GB RAM+128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,499గా నిర్ణయించారు. లాంచ్ రోజున కొనుగోలు చేస్తే రూ. 500 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఈ పరికరం ధర రూ. 9,999 కి తగ్గుతుంది. కాగా, ఈ ఫోన్ షాడో బ్లూ, టండ్రా గ్రీన్, స్లీక్ బ్లాక్ అనే మూడు రంగులలో లభిస్తుంది.

ఫీచర్లు

ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ స్మార్ట్ ఫోన్ 120Hz అధిక రిఫ్రెష్ రేట్‌తో వచ్చే 6.78-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ స్మూత్ స్క్రోలింగ్, గొప్ప వీడియో వీక్షణ, గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. దీనికి ప్రీమియం లుక్ కోసం ఫోన్ ముందు భాగంలో పంచ్-హోల్ కటౌట్ అందించారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ ను అమర్చారు. ఈ ధర విభాగంలో ఈ ప్రాసెసర్ మొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌లో వచ్చింది. దీనితో పాటు, రెండు వేరియంట్‌లలో వర్చువల్ RAM విస్తరణ ఎంపిక కూడా లభిస్తుంది.

 

Also Read: Smart Tv under 7K: ఇది కదా ఆఫర్ అంటే.. రూ.7000 కంటే తక్కువ ధరకే LED స్మార్ట్ టీవీలు..

ఇందులో ఆండ్రాయిడ్ 14 ఆధారంగా XOS 14 UIని అందించారు. అంతేకాకుండా దీనిలో ప్రత్యేక AI బటన్ ఇచ్చారు. దీనిని వినియోగదారులు తమ ఎంపిక ప్రకారం షార్ట్‌కట్‌లు లేదా AI ఫంక్షన్‌ల కోసం అనుకూలీకరించవచ్చు. ఇక భద్రత కోసం..సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లను అందించారు.

ఇక కెమెరా విషయానికి వస్తే..ఇన్ఫినిక్స్ హాట్ 60 5Gలో 50MP ప్రైమరీ రియర్ కెమెరా కలిగి ఉంది. ఇది AI ఫీచర్లతో వస్తుంది. కెమెరా ఇంటర్‌ఫేస్‌లో నైట్ మోడ్, పోర్ట్రెయిట్, HDR, AI బ్యూటీ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇక ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది AI బ్యూటీ, పోర్ట్రెయిట్ మోడ్‌తో వస్తుంది. ఈ పరికరం బిగ్ 5,000mAh బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad