Sunday, July 13, 2025
Homeటెక్నాలజీInfinix Hot 60i: 5160mAh బిగ్ బ్యాటరీ, 256GB స్టోరేజ్, 50 MP కెమెరా.....

Infinix Hot 60i: 5160mAh బిగ్ బ్యాటరీ, 256GB స్టోరేజ్, 50 MP కెమెరా.. ధర కేవలం రూ.10,000 లోపే..




Infinix Hot 60I Launched: ఇన్ఫినిక్స్ తన తాజా స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 60i మొబైల్ ను భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో విడుదల చేసింది. కాగా, ఇన్ఫినిక్స్ హాట్ 60 సిరీస్‌లో ఇదే ఫస్ట్ ఫోన్. ఈ మొబైల్ తన మునుపటి Infinix Hot 50i ని పోలి ఉంటుంది. ఈ ఫోన్ కు సంబంధించి ధర, ఫీచర్లు గురుంచి వివరంగా తెలుసుకుందాం.

ధర

ఇన్ఫినిక్స్ హాట్ 60i ఫోన్ 6జీబీ+ 128జీబీ బేస్ వేరియంట్ ధర 13,999 BDT (సుమారు రూ. 9,800)గా పేర్కొంది. ఇదే సమయంలో, 8జీబీ+ 256జిబి వేరియంట్ 16,499 BDT (సుమారు రూ. 11,500)కు అందుబాటులోకి తీసుకొచ్చింది. కంపెనీ ఈ ఫోన్‌ను స్లీక్ బ్లాక్, టైటానియం గ్రే రంగులలో విడుదల చేసింది. అయితే, ఇతర మార్కెట్లలో Infinix Hot 60i లాంచ్ పై ఎలాంటి మాత్రం సమాచారం లేదు.

ఫీచర్లు

ఇన్ఫినిక్స్ హాట్ 60i స్మార్ట్ ఫోన్ 6.78 అంగుళాల FullHD + (1,080×2,460 పిక్సెల్‌లు) IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్, 396ppi పిక్సెల్ సాంద్రతతో ఉంటుంది. స్క్రీన్ 800 nits పీక్ బ్రైట్‌నెస్‌ను కూడా అందిస్తుంది. ఈ పరికరం Android 15 ఆధారిత XOS 15.1 తో పనిచేస్తుంది.


ఈ స్మార్ట్ ఫోన్ లో 12nm ఆక్టా కోర్ MediaTek Helio G81 అల్టిమేట్ చిప్‌సెట్‌ను అమర్చారు. కేమెరా విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్, ఎపర్చరు F / 1.8, 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. కాగా, ఈ ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ గురుంచి చెప్పాలంటే.. 45W ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5160mAh బిగ్ బ్యాటరీ అందించారు. కనెక్టివిటీ కోసం 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్ 5, NFC, డ్యూయల్ సిమ్‌, GPS / A-GPS వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. యాక్సిలరోమీటర్, కంపాస్, గైరోస్కోప్ పరికరంలో ఉన్నాయి. ఈ ఫోన్ కొలతలు 167.9×75.6×7.7mm.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News