Homeటెక్నాలజీInfinix Note 60 Pro: యూత్ టార్గెట్‌గా అదిరిపోయే లుక్.. గేమింగ్ బీస్ట్‌లా రాబోతున్న ఇన్ఫినిక్స్...

Infinix Note 60 Pro: యూత్ టార్గెట్‌గా అదిరిపోయే లుక్.. గేమింగ్ బీస్ట్‌లా రాబోతున్న ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో

Infinix launch India: ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో (Infinix Note 60 Pro) 2026 మార్చి నెలలో ఇండియా మార్కెట్‌లోకి రాబోతున్న కొత్త ఫోన్. పెద్ద డిస్‌ప్లే,108MP కెమెరా,ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫ్యూచర్స్‌తో మిడ్ రేంజ్ యూజర్లను టార్గెట్ చేస్తోంది. మార్చి నెలలో కొత్త ఫోన్ కొనాలి అనుకునే వాళ్ల కోసం అప్‌డేటెడ్ లుక్‌తో ఈ మోడల్ రెడీ అవుతోంది. డేలీ యూజ్‌కు తగినంత స్పీడ్ ఇచ్చేలా ఈ ఫోన్‌ను డిజైన్ చేశారని టెక్ లీక్స్ చెబుతున్నాయి.

- Advertisement -

మార్చి డిస్‌ప్లే – ప్రాసెసర్ – స్టోరేజ్ వివరాలు

మార్చి లాంచ్ టైమ్‌కు ఈ ఫోన్‌లో 6.7ఇంచ్ ఎఫ్ హెచ్ డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే,120Hz రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది. ప్రాసెసర్‌గా మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్ చిప్ వాడతారని సమాచారం. 8GB ర్యామ్,128GB స్టోరేజ్‌తో బేస్ వేరియంట్ వస్తుంది. ఆండ్రాయిడ్14 ఆధారిత ఎక్స్ ఓ ఎస్‌తో మార్చి నెలలో అవుట్ ఆఫ్ ది బాక్స్ రావచ్చు. డేలీ యూజ్,గేమింగ్ రెండింటికీ స్మూత్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చేలా ఈ ఫోన్‌ని ట్యూన్ చేసినట్టు లీక్స్ చెబుతున్నాయి.

Read Also: iPhone 15 Offer: వార్నీ.. సెకండ్ హ్యాండ్ ఫోన్ రేటుకే కొత్త ఐఫోన్ 15.. ఇది కదా అసలైన లూట్ డీల్

మార్చి కెమెరా హైలైట్స్ – బ్యాటరీ పవర్

మార్చి రిలీజ్ కానున్న ఈ ఫోన్‌లో వెనుక వైపు 108MP మెయిన్ కెమెరా ప్లస్ డెప్త్ సెన్సార్ ఉండొచ్చు. ముందు 32MP సెల్ఫీ కెమెరా ఇస్తారని టాక్. 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000mAh కెపాసిటీతో పాటు 68W ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వొచ్చని మార్చి లీక్స్ చెబుతున్నాయి. అంటే తగినంత బ్యాటరీ బ్యాక్‌అప్‌తో పాటు తక్కువ టైమ్‌లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.

మార్చి లాంచ్ డేట్ –  ధర గురించి మాట్లాడితే..

ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో (Infinix Note 60 Pro) ఇండియాలో 2026 మార్చి మొదటి వారం అంటే మార్చి5 లేదా మార్చి6 తేదీల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ధర విషయానికి వస్తే బేస్ వేరియంట్ సుమారుగా రూ.14,999 నుంచి స్టార్ట్ అయి టాప్ వేరియంట్ రూ.16,999 వరకు ఉండొచ్చని అంచనా. మార్చి లాంచ్ తర్వాత అధికారికంగా అన్ని ఫ్యూచర్స్,ఖచ్చితమైన ధర బయటకు వస్తాయి. మార్చి నెలలో కొత్త ఫోన్ కొనాలనుకునేవాళ్లకు ఇది గట్టి పోటీ ఇచ్చే మోడల్ అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News