Sunday, January 19, 2025
Homeటెక్ ప్లస్Inter syllabus change: ఇంటర్ లోనే ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్‌ లెసెన్స్

Inter syllabus change: ఇంటర్ లోనే ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్‌ లెసెన్స్

కొత్త, క్రేజీ పాఠాలు..

ఇంటర్ విద్యార్థులపై భారం మోపకుండా వివిధ ప్రవేశ పరీక్షలకు అనుగుణంగా ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్‌లో మార్పులకు శ్రీకారం చుట్టింది. మార్కెట్‌ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త కోర్సులను సిలబస్‌లో చేర్చడానికి కసరత్తు చేస్తోంది. క్రేజీ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్​, రోబోటిక్స్‌లను సిలబస్‌లో చేర్చబోతున్నారు. దీనికితోడు కొవిడ్ మహమ్మారిలాంటి వ్యాధులపై అవగాహన పెంచేలా జువాలజీలో వైరస్‌కు సంబంధించిన అంశాలను పాఠ్యాంశాలు రూపొందిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంకల్లా కొత్త సిలబస్‌తో పుస్తకాలను ప్రింట్ చేయాలని బోర్డు నిర్ణయించింది. కొత్త సిలబస్ సమాచారం అందిస్తే పాఠ్యపుస్తకాలు ప్రింటింగ్ చేసేందుకు తెలుగు అకాడమీ కూడా సిద్ధంగా ఉంది.
సిలబస్‌పై కమిటీలు
ప్రస్తుతం సైన్స్, ఆర్ట్స్ సబ్జెక్టుల్లో సిలబస్‌లో మార్పులు చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే సీనియర్ ప్రొఫెసర్లు, లెక్చరర్లతో సిలబస్ కమిటీలు వేశారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్‌తో పాటు జువాలజీ, బోటనీ సిలబస్‌ను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు సిలబస్‌లో కోత పెడుతున్నారు. దీనికితోడు పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు కొత్తగా వివిధ అంశాలను చేర్చడంపై దృష్టిపెట్టారు. ఇంటర్​ ఫిజిక్స్‌లో ఏఐతోపాటు రోబోటిక్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ తదితర అంశాలు చేర్చాలని ఇంటర్మీడియెట్​ అధికారులు భావిస్తున్నారు. బీటెక్, డిగ్రీలో కొన్ని కోర్సులకు బాగా డిమాండ్ ఉంది. దీంతో ముందుగానే ఆయా సబ్జెక్టులను విద్యార్థులకు పరిచయం చేయాలని నిర్ణయించారు. విద్యార్థులపై ఎక్కువ భారం పడకుండా ముందుగా కొత్త సబ్జెక్టులకు సంబంధించి కేవలం బేసిక్స్ మాత్రమే చేర్చనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు చెప్పారు. జువాలజీలో ‘కరోనా వైరస్’ పాఠాన్ని చేర్చబోతున్నారు. వైరస్‌లు వ్యాపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించాలి? అనే అంశాలు పొందుపరుస్తున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ దృష్టిలో పెట్టుకొని జేఈఈ, నీట్, సీయూఈటీ ఎంట్రన్స్లకు తగ్గట్టుగా మార్పులు రానున్నాయి. దీంతో ప్రైవేట్ కోచింగ్ అవసరం లేకుండానే ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో మంచి ర్యాంక్ సాధించే అవకాశం ఉంది.

- Advertisement -

అప్‌డేట్‌తో అకాడమీ పుస్తకాలు
నిరుద్యోగులు ఎదురు చూసున్న అకాడమీ పుస్తకాలను నోటిఫికేషన్ వచ్చే సమాయానికి అప్‌డేట్ పుస్తకాలను తీసుకొచ్చేందుకు తెలుగు అకాడమీ సిద్దమవుతోంది. పుస్తకాల్లో పొరపాట్లను సరిచేసి పూర్తిగా అప్ డేట్ డేటాతో అభ్యర్థులకు అందుబాటులోకి పుస్తకాలు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీలో వచ్చిన కొత్త మార్పులను చేర్చనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News