Iphone 16 plus: దేశంలో పండగ సీజన్ ప్రారంభమైంది. దీపావళి సందర్బంగా చాలామంది అనేక కొత్త వస్తువులు కొనడానికి ఆసక్తి చూపుతుంటారు. అందులో స్మార్ట్ ఫోన్లు కొనేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు కూడా ఈ సమయంలో కొత్త ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకో గుడ్ న్యూస్! రిలయన్స్ డిజిటల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్ 16 ప్లస్ గణనీయమైన డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఐఫోన్‌లపై ఇటువంటి ఆఫర్లు చాలా అరుదు. కావున ఈ డీల్ అస్సులు వదులుకోకండి. ఇలాంటి బంపర్ డిస్కౌంట్లు సాధారణంగా ఎక్కువ రోజులు ఉండవు. కావున ఐఫోన్ 16 ప్లస్ కొనాలని అనుకుంటే ప్లాన్ చేస్తుంటే వెంటనే కొనేసుకోవడం బెటర్. ఇప్పుడు ఐఫోన్ 16 ప్లస్ ఆఫర్, ఫీచర్ల వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
also read:Samsung Galaxy M17 5G Launched: AI స్మార్ట్ ఫీచర్లతో శామ్సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్..ధర కూడా తక్కువే!
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ డీల్
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ఇండియాలో రూ.79,900 ప్రారంభ ధరకు లాంచ్ అయినా విషయం తెలిసిందే! అయితే, ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పుడు రిలయన్స్ డిజిటల్ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.67,990కి లిస్ట్ అయింది. అంటే..రిటైలర్ ఐఫోన్ 16 ప్లస్ పై ఏకంగా రూ.11,910 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ఫీచర్లు
గేటురేలా విషయానికి వస్తే, ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఆపిల్ A18 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. అదనంగా, ఐఫోన్ 16 ప్లస్ IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. టెక్ కంపెనీ ప్రకారం..ఐఫోన్ 16 ప్లస్ 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. ఫోటోగ్రఫీ పరంగా, ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 12MP ఫ్రంట్ కెమెరా అందించారు.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


