Saturday, November 15, 2025
Homeటెక్నాలజీiPhone 17 Air: ఐఫోన్ 17 ఎయిర్ బ్యాటరీ వివరాలు లీక్.. దీని ప్రత్యేకత ఏంటో...

iPhone 17 Air: ఐఫోన్ 17 ఎయిర్ బ్యాటరీ వివరాలు లీక్.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

iPhone 17 Air Battery Leaks: ఆపిల్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఐఫోన్ 17 సిరీస్ ను సెప్టెంబర్‌లో మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్ కు సంబంధించిన అనేక వివరాలు ఆన్లైన్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సిరీస్ లో ఎక్కువగా చర్చించబడినది ఐఫోన్ 17 ఎయిర్ చిన్న బ్యాటరీ కెపాసిటీ. ఈసారి ఐఫోన్ 17 ఎయిర్ ఐఫోన్ 16 కంటే తక్కువ బ్యాటరీని కలిగి ఉండవచ్చని సమాచారం. కానీ, ఈ పరికరంలో iOS 26 కొత్త ‘అడాప్టివ్ పవర్ మోడ్’ రోజంతా పనిచేయడానికి సహాయపడుతుంది. ఈ కొత్త మోడల్ గురించి లీకైన ప్రత్యేక విషయాల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

వీబోలో టిప్‌స్టర్ ఇన్‌స్టంట్ డిజిటల్ ద్వారా కొత్త లీక్ ప్రకారం..ఐఫోన్ 17 ఎయిర్ 3,000mAh కంటే తక్కువ బ్యాటరీని కలిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ఫోన్ లో బ్యాటరీ చిన్నగా ఉన్నప్పటికీ, iOS 26లో వస్తున్న కొత్త ‘అడాప్టివ్ పవర్ మోడ్’ ఒక రోజు బ్యాటరీ బ్యాకప్‌ను అందించడంలో సహాయపడుతుంది.

ఈ ఫోన్‌లో 2,800mAh బ్యాటరీ ఉండవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. ఒకవేళ నిజమైతే ఐఫోన్ 17 ఎయిర్ ఐఫోన్ 12, ఐఫోన్ 13 తర్వాత 3,000mAh కంటే తక్కువ బ్యాటరీ ఉన్న మొదటి ఐఫోన్ ఇదే అవుతుంది. ఈ సంవత్సరం మొదట్లో ది ఇన్ఫర్మేషన్‌కు చెందిన వేన్ మా, ఐఫోన్ 17 ఎయిర్ బ్యాటరీ లైఫ్ మునుపటి మోడళ్ల కంటే బలహీనంగా ఉండవచ్చని నివేదించారు. ఎందుకంటే ఈ పరికరం 5.5mm అల్ట్రా-సన్నని డిజైన్ లోపల తక్కువ బ్యాటరీ స్థలాన్ని అనుమతిస్తుంది. ఆపిల్ అంతర్గత పరీక్ష ప్రకారం..60–70% వినియోగదారులు మాత్రమే రీఛార్జ్ చేయకుండా రోజంతా దీన్ని ఉపయోగించగలరు. ఈ కారణంగా ఆపిల్ ఐచ్ఛిక బ్యాటరీ కేసును కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. ఆపిల్ చివరిసారిగా ఐఫోన్ 11 సిరీస్‌తో బ్యాటరీ కేసును ప్రవేశపెట్టింది. దీని తర్వాత ఐఫోన్ 12 కోసం మాగ్‌సేఫ్ బ్యాటరీ ప్యాక్ ప్రారంభించింది.

Also Read: Thomson Masterclass Series Mini LED TV: అదిరిపోయే ఫీచర్లతో థామ్సన్‌ నుంచి మినీ LED టీవీలు..

ఐఫోన్ 17 ఎయిర్ కు సంబంధించి లీకైన ఫీచర్లు

డిజైన్:
ఐఫోన్ 17 ఎయిర్ ఫ్రేమ్ 7000-సిరీస్ అల్యూమినియం మిశ్రమంతో తయారు చేయబడుతుంది. ఇది తేలికైనది. ఎంతో బలంగా కూడా ఉంటుంది. ఈ పరికరం మునుపటి ఐఫోన్ 16 ప్రోలో ఉపయోగించిన టైటానియం కంటే దాదాపు 30 గ్రాములు తేలికగా ఉంటుంది.

డిస్ప్లే:
దీనికి 120Hz OLED స్క్రీన్ ఉంటుంది.

కెమెరా:
వెనుక భాగంలో 48MP సింగిల్ కెమెరా ఉంటుంది. ఇక ముందు భాగంలో 24MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది కంటెంట్ క్రియేటర్స్ కు, వీడియో కాల్‌లకు అనుకూలంగా ఉంటుంది.

ప్రాసెసర్, పనితీరు:
ఫోన్‌లో ఆపిల్ కొత్త A19 చిప్‌సెట్, 8GB RAM ఉండవచ్చు. పనితీరు ఐఫోన్ 16 ప్లస్‌తో సమానంగా ఉంటుందని సమాచారం.

ఇతర ఫీచర్లు:
ఫోన్‌లో గ్లాస్ బ్యాక్ ప్యానెల్, ఆపిల్ మాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండవచ్చు. అలాగే, ఇందులో ఫేస్ ఐడి అందుబాటులో ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad