Iphone 17 Pro Max Cosmic Orange Goes Out Of Stock: ఆపిల్ ఈ నెల ప్రారంభంలో తన కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను పరిచయం చేసింది. ఇందులో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఉన్నాయి. ముందస్తు బుకింగ్స్ సెప్టెంబర్ 12న ప్రారంభమయ్యాయి.ఈ సిరీస్ తో పాటు ఆపిల్ వాచ్ సిరీస్ 11, వాచ్ అల్ట్రా 3, వాచ్ SE 3, ఎయిర్‌పాడ్స్ ప్రో 3 ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 19న నుంచి వీటిని డెలివరీ చేయనున్నారు. ఈసారి ఈ సిరీస్‌కు గత సంవత్సరం కంటే ఎక్కువగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా, ఐఫోన్ 17 ప్రో మాక్స్ కాస్మిక్ ఆరెంజ్ వేరియంట్ కు భారీ స్పందన వస్తోంది.
Also Read:Cell Phone Side Effects: స్మార్ట్ ఫోన్ అధికంగా వాడుతున్నారా..? ఈ సమస్యలు తప్పవు!
ఆపిల్ ప్రకారం..కాస్మిక్ ఆరెంజ్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ ప్రస్తుతం అత్యధిక డిమాండ్‌లో ఉంది. యుఎస్, ఇండియాలో ముందస్తు బుకింగ్ లను ప్రారంభించిన మూడు రోజుల్లోనే, ఐఫోన్ 17 ప్రో మాక్స్ కు ఆర్డర్లు తీసుకోవడం ఆపేశారు. భారత్ లో మొత్తం ప్రో మాక్స్ సిరీస్ ఇంకా స్టోర్‌లో ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులో లేదు. ఆపిల్ బృందం తిరిగి స్టాక్ చేయడానికి నిరంతరం కృషి చేస్తోంది. అయితే, ఆరెంజ్ వేరియంట్ అన్ని స్టోరేజ్ మోడల్‌లు అమ్ముడయ్యాయని కంపెనీ తెలిపింది.
భారత్ లో ఐఫోన్ 17 ప్రో మాక్స్ కోసం ఇన్-స్టోర్ పికప్ చేసుకునే సదుపాయంతో కాస్మిక్ ఆరెంజ్ రంగులోని ఐఫోన్ ప్రో మాక్స్, ఐఫోన్ ప్రో సిరీస్ కు ఆర్డర్లు తీసుకోవడం లేదు. భారీ సంఖ్యలో ముందస్తు ఆర్డర్లు రావడమే ఇందుకు కారణమని ఆపిల్ అధికారి ఒకరు తెలిపారు. కొన్ని స్టోర్లలో డీప్ బ్లూ, సిల్వర్ వేరియంట్‌లు ఇప్పటికీ పరిమిత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 19 నుండి వాక్-ఇన్ కస్టమర్ల కోసం స్టోర్‌లలో పరిమిత సంఖ్యలో యూనిట్లను అందుబాటులో ఉంచాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఫోన్‌లు మొదట వచ్చిన వారికి ముందుగా అందించనున్నారు. కాగా ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ ను రూ.82900- రూ.2,29,900 ధరల శ్రేణిలో విడుదల చేసింది.


