iQOO 13 Ace Green Colour Variant Launched: iQOO 13 మొదటిసారిగా డిసెంబర్ 2024లో లెజెండ్, నార్డో గ్రే కలర్ ఆప్షన్లలో భారతదేశంలో విడుదల అయినా విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పరికరం మూడవ కలర్ వేరియంట్ మార్కెట్లోకి రిలీజ్ అయింది. కొత్త ఏస్ గ్రీన్ కలర్ లో వస్తున్నఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే ఉన్న హ్యాండ్‌సెట్‌ను పోలి ఉంటుంది. కొత్త రంగు తప్ప ఈ ఫోన్ స్పెసిఫికేషన్లలో ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు ఈ ఫోన్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ధర
iQOO 13 12GB + 256GB వేరియంట్ ధర రూ. 54,999గా పేర్కొంది. అదేవిధంగా 16GB + 512GB మోడల్ ధర రూ. 59,999గా నిర్ణయించింది. ఈ ఫోన్ ఇప్పుడు లెజెండ్, నార్డో గ్రే కలర్, కొత్త ఏస్ గ్రీన్ అనే మూడు రంగులలో అందుబాటులో ఉంది. కొత్త గ్రీన్ వేరియంట్ జూలై 12, మధ్యాహ్నం 12 గంటల నుండి అమెజాన్, iQOO ఇండియా ఈ-స్టోర్ ద్వారా దేశంలో అమ్మకానికి వస్తుందని కంపెనీ తెలిపింది.
ఫీచర్లు
iQOO 13 స్మార్ట్ ఫోన్ 6.82-అంగుళాల 2K (1,440×3,186 పిక్సెల్స్) LTPO AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంది. ఇందులో 3nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, ఇన్-హౌస్ గేమింగ్ Q2 చిప్ ను అమర్చారు. హ్యాండ్‌సెట్ 16GB వరకు LPDDR5X అల్ట్రా RAM, 512GB వరకు UFS 4.1 నిల్వను అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15-ఆధారిత Funtouch OS 15 తో నడుస్తుంది.
Also Read: Itel City 100 : 12జీబీ ర్యామ్, 5200mAh బ్యాటరీతో ఐటెల్ కొత్త ఫోన్.. ధర కేవలం రూ.7,599
ఫోటోగ్రఫీ కోసం.. iQOO 13 స్మార్ట్ ఫోన్ లో 50-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్, 2x ఆప్టికల్ జూమ్‌తో 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఈ పరికరం 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68, IP69 రేటింగ్‌లను పొందింది. కనెక్టివిటీ కోసం.. ఫోన్ 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, GPS, USB 3.2 Gen 1 టైప్-C వంటి ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. ఈ మొబైల్ 8.13mm మందం. 213 గ్రాముల బరువు.