IQOO 15 Features Leak: అక్టోబర్‌లో ఐక్యూ 15 చైనాలో లాంచ్ అవుతుంది. ఐక్యూ 13 మోడల్ తర్వాత వస్తోన్న మోడల్ ఇది. కంపెనీ ఇప్పటికే డిజైన్‌ను టీజ్ చేసింది. దీని దాని చిప్‌సెట్, డిస్‌ప్లే స్పెసిఫికేషన్‌లతో సహా ఫోన్ కొన్ని వివరాలను కూడా ధృవీకరించింది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. అలాగే 2K శామ్సంగ్’ఎవరెస్ట్’ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ లైవ్ చిత్రాలు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ఇవి దీని కెమెరా సెన్సార్, IP రేటింగ్, హీట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను వెల్లడిస్తున్నాయి.
గతంలో ట్విట్టర్‌లో ఐక్యూ15 లైవ్ చిత్రాలను లీక్ అయ్యాయి. అయితే ప్రస్తుతం లీక్ అయినా చిత్రాల ప్రకారం ఇది వైట్ కలర్ రంగులో ఉన్నట్లు కనిపిస్తుంది. వెనుక ప్యానెల్ ఎగువ-ఎడమ వైపున ‘స్క్విర్కిల్’ కెమెరా మాడ్యూల్ ఉంది. ఫోన్ ఫ్లాట్ డిస్ప్లే చాలా స్లిమ్, ఏకరీతి బెజెల్స్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ముందు కెమెరాను కలిగి ఉన్న పై మధ్యలో హోల్-పంచ్ స్లాట్ ఉంచబడింది. వచ్చే అక్టోబర్‌లో చైనాలో లాంచ్ అయిన తర్వాత ఐక్యూ15 ఇండియా లాంచ్ నవంబర్ లేదా డిసెంబర్‌లో జరగవచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇండియా లాంచ్ ఖచ్చితమైన తేదీ తెలియనప్పటికీ అతి త్వరలోనే లాంచ్ అవుతున్నట్లు సమాచారం.
ఐక్యూ15 వెనుక భాగంలో మూడు 50-మెగాపిక్సెల్ సెన్సార్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. వీటిలో 5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో టెలిఫోటో షూటర్ కూడా ఉంటుంది. భద్రత కోసం ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉండవచ్చు. ఫోన్ దుమ్ము, నీటి నిరోధకత కోసం IP69 రేటింగ్‌ను కలిగి ఉండవచ్చు. ఇది USB 3.2 టైప్-C కనెక్టివిటీకి మద్దతు ఇవ్వవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఇది 100W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు. వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుందని భావిస్తున్నారు.
పనితీరు గురించి మాట్లాడితే ఐక్యూ15 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ను పొందుతుంది. కొత్త Q3 గేమింగ్ చిప్‌తో వస్తుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. ఇది 6.85-అంగుళాల 2K 8T LTPO శామ్సంగ్ ‘ఎవరెస్ట్’ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ 6,000 నిట్స్ వరకు పీక్ లోకల్ బ్రైట్‌నెస్, 2,600 నిట్స్ ఫుల్-స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.


