iQOO Neo 11: చైనాకు చెందిన వివో సబ్‌బ్రాండ్ ఐకూ మార్కెట్లో సరికొత్త పరికరాన్ని లాంచ్ చేసింది. కంపెనీ దీని చైనాలో ఐక్యూ నియో 11 పేరిట తీసుకొచ్చింది. త్వరలోనే భారతదేశంలో కూడా లాంచ్ కావచ్చు కావొచ్చని సమాచారం! ఈ కొత్త ఫోన్ 7500mAh బిగ్ బ్యాటరీ, 2K రిజల్యూషన్‌తో 6.82-అంగుళాల అమోలేడ్ డిస్‌ప్లే, 50-మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంది. చైనాలో నాలుగు రంగులలో లభిస్తోన్న ఈ పరికరం ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఐక్యూ నియో 11 ధర, లభ్యత:
చైనాలో ఐక్యూ నియో 11 స్మార్ట్ ఫోన్ 12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,599 యువాన్ల (సుమారు రూ. 32,500) నుండి ప్రారంభమవుతుంది. అలాగే, 12GB+512GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,999 యువాన్లు (సుమారు రూ. 38,500)గా, 16GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,899 యువాన్లు (సుమారు రూ. 36,000)గా, 16GB+512GB స్టోరేజ్ వేరియంట్ ధర 3,299 యువాన్లు (సుమారు రూ. 41,000)గా, 16GB+1TB స్టోరేజ్ వేరియంట్ ధర 3,799 యువాన్లు (సుమారు రూ. 47,000)గా నిర్ణయించింది. ఈ పరికరం ప్రస్తుతం చైనాలో కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఫేసింగ్ ది విండ్, గ్లోయింగ్ వైట్, పిక్సెల్ ఆరెంజ్, షాడో బ్లాక్ వంటి రంగులలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
ఐక్యూ నియో 11 ఫీచర్లు:
డిస్ప్లే
ఈ ఫోన్ 6.82-అంగుళాల 2K (1440×3168 పిక్సెల్స్) LTPO అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్, 510 ppi పిక్సెల్ డెన్సిటీతో ఉంటుంది. డిస్ప్లే 2,592 Hz PWM డిమ్మింగ్, 3200 Hz టచ్ శాంప్లింగ్ రేట్, 25.4ms టచ్ రెస్పాన్స్ టైమ్‌ను కలిగి ఉంది.
ALSO READ: Vivo X300 series: వివో అరాచకం.. ఏకంగా 200 ఎంపీ కెమెరాతో స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఫీచర్ల జాతర..!
ప్రాసెసర్, స్టోరేజీ
ఈ పరికరం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 16GB వరకు LPDDR5X RAM, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్‌తో జత చేసారు. ఈ ఫోన్ AnTuTu బెంచ్‌మార్క్ పరీక్షలో 3.54 మిలియన్లకు పైగా స్కోర్‌ను సాధించిందని పేర్కొన్నారు. ఈ ఫోన్ ఐక్యూ సొంతం మాన్స్టర్ సూపర్-కోర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది ఐక్యూ 15లో కూడా ఉంది.
సాఫ్ట్ వేర్
ఇది డ్యూయల్ నానో-సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ఆరిజిన్ఓఎస్ 6పై నడుస్తుంది.
కెమెరా
ఫోటోగ్రఫీ కోసం..ఐక్యూ నియో 11 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో OISతో 50-మెగాపిక్సెల్ 1/1.56-అంగుళాల ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం..f/2.45 ఎపర్చర్‌తో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ
ఈ ఫోన్ 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7500mAh బ్యాటరీని కలిగి ఉంది. కొలతలు 163.37×76.71×8.05mm. బరువు 216 గ్రాములు
కనెక్టివిటీ ఫీచర్లు
ఇందులో 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS, GLONASS, గెలీలియో, బీడౌ, NFC, GNSS, QZSS, USB టైప్-C పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. ఫోన్ అల్ట్రాసోనిక్ 3D ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంది.


