iQOO Z10R 5G Price and Specifications: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ, వివో సబ్-బ్రాండ్ ఐక్యూ భారత మార్కెట్‌లో కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గురింపు సంపాదించుకుంది. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లు అందిస్తుండటంతో క్రేజీ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ అందించి వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా ఐక్యూ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఐక్యూ Z10R 5Gని తాజాగా రష్యాలో విడుదల చేసింది. కంపెనీ ఇటీవల భారతదేశంలో అదే పేరుతో ఒక మోడల్‌ను లాంచ్ చేసింది. అయితే ఈ రెండు ఫోన్లు డిజైన్, ప్రాసెసర్, బ్యాటరీ, స్టోరేజ్ విషయాల్లో కాస్త భిన్నంగా ఉంటాయి. ఈ రెండు మోడళ్లు ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15పై నడుస్తాయి. ఐక్యూ Z10R 5G మొబైల్ 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటాయి. అయితే, భారత్‌లో విడుదలైన ఈ మొబైల్ వేరియంట్ కాస్త సన్నగా, తేలికైన బరువుతో ఉంటుంది. ఈ మోడల్ ధర, స్పెసిఫికేషన్ల వివరాలను పరిశీలిద్దాం.
ఐక్యూ Z10R 5G ధర
రష్యాలో విడుదలైన ఐక్యూ Z10R 5G ధర విషయానికొస్తే.. ఇది రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 26,000 నుండి ప్రారంభమవుతుంది. అదే సమయంలో 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 31,000 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ డీప్ బ్లాక్, టైటానియం షైన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఐక్యూ Z10R 5G స్పెసిఫికేషన్లు..
ఐక్యూ Z10R 5G స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. రష్యన్ వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15పై పనిచేస్తుంది. అనంతరం ఓరిజన్ ఓఎస్ 6 అప్‌డేట్స్‌తో వస్తుంది. కొత్త ఐక్యూ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360-టర్బో(4nm) చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఇది 12GB వరకు ర్యామ్, 512GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇక కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఐక్యూ Z10R 5G స్మార్ట్‌ఫోన్‌లో 50MP సోనీ IMX882 ప్రైమరీ సెన్సార్, 8MP వైడ్-యాంగిల్ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. దీని ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,500mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లో జూలై 24న రిలీజైంది. దీని బేస్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,499 వద్ద రిలీజైంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్, 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది.


