Tuesday, July 15, 2025
Homeటెక్నాలజీiQOO Z10R: ఐక్యూ నుంచి కొత్త ఫోన్..లాంఛ్​కు ముందే స్పెక్స్ లీక్..

iQOO Z10R: ఐక్యూ నుంచి కొత్త ఫోన్..లాంఛ్​కు ముందే స్పెక్స్ లీక్..

iQOO Z10R specs Leaks: భారతీయ మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Z10Rను విడుదల చేయడానికి iQOO సన్నాహాలు చేస్తోంది. ఇది బడ్జెట్ ధరలో వస్తోందని తెలుస్తోంది. ఇది త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, కంపెనీ ఇంకా అధికారికంగా ఫోన్ లాంచ్ తేదీని దృవీకరించనప్పటికీ కెమెరా, బ్యాటరీ, ధర వంటి పరికరం ప్రధాన ఫీచర్లు ఆన్‌లైన్​లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

- Advertisement -

లీక్ ల ప్రకారం.. iQOO Z10R 6.77-అంగుళాల 120Hz క్వాడ్ కర్వ్డ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ను ఉపయోగించే అవకాశం ఉంది. ఇక డిజైన్ గురించి చెప్పాలంటే.. ఈ ఫోన్ వివో V50 సిరీస్‌ని పోలి ఉంటుంది. అదే కెమెరా మాడ్యూల్, ఆరా లైట్‌కు మద్దతు ఉంటుంది. iQOO బ్రాండింగ్ ఫోన్ వెనుక భాగంలో దిగువన ఉంటుంది. ఇది మెరుగైన గ్రిప్ కోసం ప్లాస్టిక్ బాడీ, వంపుతిరిగిన అంచులను కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో 6,000mAh బిగ్ బ్యాటరీ అందించొచ్చు. ఇది 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ ఈ సంవత్సరం ఇతర iQOO ఫోన్‌లలో చూసినట్లుగా Android 15 ఆధారిత FunTouch OS 15లో పనిచేస్తుంది. iQOO Z10R 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండొచ్చు. ఇది OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) కు మద్దతు ఇవ్వొచ్చు. ముందు భాగంలో 32MP లేదా 50MP సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. ఫోన్ ముందు, వెనుక కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్ చేయొచ్చు.

దీని ఖచ్చితమైన ధర దృవీకరించనప్పటికీ ఈ ఫోన్‌ను ₹ 20,000 కంటే తక్కువ ధరకు లాంచ్ చేయవచ్చు. ఎందుకంటే iQOO ఇప్పటికే ₹ 20,000 కంటే ఎక్కువ శ్రేణిలో iQOO Neo 10R, iQOO Z10 వంటి ఎంపికలను తీసుకొచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News