Saturday, November 15, 2025
Homeటెక్నాలజీLaptop Battery: లాప్‌టాప్ ఛార్జింగ్ రహస్యం: ఎల్లప్పుడూ ప్లగిన్ చేసి ఉంటే బ్యాటరీ డ్యామేజ్ అవుతుందా..?

Laptop Battery: లాప్‌టాప్ ఛార్జింగ్ రహస్యం: ఎల్లప్పుడూ ప్లగిన్ చేసి ఉంటే బ్యాటరీ డ్యామేజ్ అవుతుందా..?

Laptop Battery Healthv: లాప్‌టాప్‌లు 10 ఏళ్ల కిందటి కంటే ఇప్పుడు ఎంతో శక్తివంతంగా మారాయి. భారీ ఎడిటింగ్ ప్రాజెక్టులు, గేమింగ్ అండ్ ఫీచర్ ఫిల్మ్‌లను రూపొందించే సామర్థ్యం వీటికుంది. ఈ పెరిగిన సామర్థ్యానికి అనుగుణంగానే.. వాటి బ్యాటరీలు కూడా మెరుగైన స్క్రీన్ టైమ్‌ను అందిస్తున్నాయి. అయితే ఈ శక్తిమంతమైన బ్యాటరీలకు కూడా ఒక పరిమితి ఉంటుంది. వాటిని తరచుగా ఛార్జ్ చేయాల్సి వస్తుంది. దీనితో ఎలక్ట్రిక్ సాకెట్‌కు కట్టిపడేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే చాలా మందిలో ఉండే అనుమానం మీరు మీ లాప్‌టాప్‌ను ఎల్లప్పుడూ ఛార్జర్‌కు కనెక్ట్ చేసి ఉంచాలా.. లేక 70-80% ఛార్జ్ అయిన తర్వాత తీసివేయాలా? అనేదే. ఫుల్ చార్జ్ తర్వాత కూడా అలాగే ఉంచితే బ్యాటరీ పాడవుతుందని చాలా మంది నమ్ముతారు.

- Advertisement -

సాధారణంగా చాలా మంది లాప్‌టాప్‌ను ఎల్లప్పుడూ ప్లగ్ ఇన్ చేసి ఉంచితే బ్యాటరీ దెబ్బతింటుందని భావిస్తారు. అయితే ఇటీవల ఎక్స్ లో @0x45o అనే యూజర్ పంచుకున్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లాప్‌టాప్‌ను ఎల్లప్పుడూ ప్లగ్ ఇన్ చేసి ఉంచడం కంటే, తరచుగా ఛార్జింగ్ డ్రెయిన్ చేసి, మళ్లీ నింపడం వల్ల బ్యాటరీకి ఎక్కువ నష్టం జరుగుతుందని చెప్పాడు. పోస్ట్ వైరల్ కావటంతో.. కొందరు టెక్ ఔత్సాహికులు దీనిని బలపరుస్తూ.. లాప్‌టాప్ 100% ఛార్జ్ అయిన తర్వాత అది ఛార్జింగ్‌ను తీసుకోవటం ఆపేసి.. నేరుగా AC పవర్‌తో నడుస్తుందని, ఇది బ్యాటరీ డిగ్రేడేషన్‌ను ఆపుతుందని చెప్పారు.

మరికొందరు మాత్రం బ్యాటరీని ఎప్పుడూ 100% ఛార్జింగ్ వద్ద ఉంచడం మంచిది కాదని.. 80 శాతానికి పరిమితం చేసి ప్లగ్ ఇన్ చేసి ఉంచడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ప్లగ్ ఇన్ చేసి ఉంచితే సైకిల్ కౌంట్‌ను తగ్గిస్తుందని, 80% వద్ద ఉంచడం వల్ల బ్యాటరీకి ఒత్తిడి తగ్గుతుందని వారు వివరించారు.

నిపుణుల అభిప్రాయం ఏమిటి?
అంకర్ (Anker) వంటి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారులు బ్యాటరీ నిపుణులు ఈ అంశాన్ని లోతుగా పరిశోధించారు. ఆధునిక లిథియం-అయా, లిథియం-పాలిమర్ బ్యాటరీలు సాధారణంగా “ఓవర్‌ఛార్జ్” కావు. అంటే బ్యాటరీ 100% ఛార్జ్ అయిన వెంటనే.. లాప్‌టాప్ ఛార్జింగ్ ఆపివేసి, కరెంట్ ను నేరుగా సిస్టమ్‌కు సరఫరా చేస్తుందని చెప్పారు. దీనివల్ల బ్యాటరీ పదే పదే ఛార్జ్ అవ్వదు. దీనిని ‘జీరో సైకిల్ కౌంట్’అని అంటారని వెల్లడించారు. అంటే ఫుల్ చార్జ్ ఉన్న సమయంలో కూడా పవర్ ప్లగిన్ చేసి ఉంచితే నేరుగా కరెంట్ సిస్టమ్ వాడటం వల్ల బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం మన్నుతుందని పరోక్షంగా అర్థం చేసుకోవచ్చు.

బ్యాటరీ లైఫ్ ప్రభావం చేసే అంశాలివే:
1. ఉష్ణోగ్రత: 35°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద లాప్‌టాప్‌ను ఆపరేట్ చేయడం వల్ల బ్యాటరీ వేగంగా క్షీణిస్తుంది. ల్యాప్‌టాప్‌ను సోఫా, పరుపు లేదా దుప్పటిపై కాకుండా గాలి ప్రసరణ ఉండే చదునైన ఉపరితలంపై ఉంచడం చాలా ముఖ్యం.
2. వోల్టేజ్ స్థాయి: బ్యాటరీని నిరంతరం 100% ఛార్జ్ చేసి ఉంచడం వల్ల బ్యాటరీ సెల్‌లపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది బ్యాటరీ లైఫ్ తగ్గిస్తుంది. అందుకే 80% నుండి 90% మధ్య ఛార్జ్ చేసి ఉంచడం, 20% కంటే తగ్గకుండా చూసుకోవడం చాలా మంచి పద్ధతి.
3. తరచుగా ఛార్జింగ్/డిశ్చార్జింగ్: తరచుగా బ్యాటరీని పూర్తిగా ఖాళీ చేసి, మళ్లీ పూర్తిగా నింపడం వల్ల సెల్‌లపై అనవసరమైన ఒత్తిడి పెరిగి, జీవితకాలం తగ్గుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad