చంద్రయాన్ 3 విజయవంతం ద్వారా భారతదేశానికి మంచి ఖ్యాతి లభించిందని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ టెక్నికల్ ఆఫీసర్ మహేంద్రనాథ్ స్పష్టం చేశారు. ఆళ్లగడ్డలో జరిగిన ఒక పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నందుకు వచ్చిన సందర్భంగా అధికారి మహేంద్రనాథ్ మీడియాతో మాట్లాడారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో తాను పనిచేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. చంద్ర గ్రహం పై సేఫ్ లాండింగ్ అయిన తర్వాత చంద్రయాన్ 3 విలువైన సమాచారాన్ని షేర్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఒక లుమినార్ డే (14రోజులు) అక్కడి వాతావరణ పరిస్థితులు ఖనిజాలపై పరిశోధన అనంతరం ప్రస్తుతం స్లీప్ మోడ్ లో ఉందన్నారు. ఆదిత్య L1 గురించి ప్రశ్నించగా ఆదిత్య యల్ వన్ ద్వారా సూర్య గ్రహం పై కూడా ఇస్రో పరిశోధనలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిపారు. దీని ద్వారా సూర్యునికి అతి దగ్గరగా వెళ్లి అక్కడ కూడా పరిశోధనలు జరిపేందుకు రాబోయే రోజుల్లో సాధ్యపడుతుందని టెక్నికల్ ఆఫీసర్ మహేంద్ర నాథ్ వివరించారు.
ISRO Tech director: చంద్రయన్-3 విజయంతో భారతదేశం ప్రపంచ దేశాల సరసన
శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ రీఛార్జ్ సెంటర్ టెక్నికల్ ఆఫీసర్ మహేంద్ర నాథ్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES