Wednesday, January 14, 2026
Homeటెక్నాలజీItel Zeno 20 Max: 5000mAh బ్యాటరీతో ఐటెల్ జెనో 20 మ్యాక్స్ వచ్చేసిందోచ్..! ధర...

Itel Zeno 20 Max: 5000mAh బ్యాటరీతో ఐటెల్ జెనో 20 మ్యాక్స్ వచ్చేసిందోచ్..! ధర కేవలం రూ.5,799 మాత్రమే!

Itel Zeno 20 Max Launched: ఐటెల్ కంపెనీ భారత్‌లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది.కంపెనీ దీని ఐటెల్ జెనో 20 మ్యాక్స్ పేరిట లాంచ్ చేసింది. ఈ పరికరం 6.6 అంగుళాల HD+ డిస్‌ప్లే, T7100 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 13-మెగాపిక్సెల్ కెమెరా, 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. చాలారోజుల నుంచి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనీ చేస్తున్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ క్రమంలో ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ధర, లభ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

ఐటెల్ జెనో 20 మ్యాక్స్: ధర

కంపెనీ ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 3GB RAM+64GB స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.5,799కి నిర్ణయించగా, 4GBRAM+64GB స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.6,169గా పేర్కొంది. ఈ ఫోన్‌ను అమెజాన్ నుండి అరోరా బ్లూ, స్పేస్ టైటానియం, స్టార్‌లిట్ బ్లాక్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. అయితే, ఐటెల్ జెనో 20 మ్యాక్స్ మరొక వేరియంట్ ఈ నెలలో లాంచ్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది.
ఇందులో 4GBRAM+128GB స్టోరేజ్ ఉండవచ్చు.

also read:Oppo Pad 5 Launched: 12.1 అంగుళాల డిస్‌ప్లే, 10,050mAh బ్యాటరీతో ఒప్పో ప్యాడ్ 5 లాంచ్..ధరెంతో తెలుసా..?

ఐటెల్ జెనో 20 మ్యాక్స్: ఫీచర్లు

డిస్ప్లే: ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.6-అంగుళాల HD+ రిజల్యూషన్ IPS డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

చిప్‌సెట్: వేగం, మల్టీ టాస్కింగ్ కోసం ఈ హ్యాండ్‌సెట్ T7100 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది.

స్టోరేజీ: ఫోన్ 4GB వరకు ర్యామ్, 64GB అంతర్గత నిల్వతో వస్తుంది. మెమరీ ఫ్యూజన్ ఫీచర్‌ని ఉపయోగించి నిల్వను 8GB వరకు విస్తరించవచ్చు.

కెమెరా సెటప్: ఫోన్‌లో 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరా సెన్సార్ ఉంది. ఇక సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ ముందు కెమెరాను అందించారు.

also read:SIM card fraud : సీబీఐ ‘చక్రవ్యూహం’.. సైబర్ నేరాలకు సిమ్‌లు, టెలికాం అధికారి అరెస్ట్!

బ్యాటరీ: ఐటెల్ జెనో 20 మ్యాక్స్ 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే, ఈ పరికరంతో పాటు 10W ఛార్జర్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో అంతర్నిర్మిత వాయిస్ అసిస్టెంట్ ఉంది. DTS-ఆధారిత సౌండ్‌కు మద్దతు ఇస్తుంది.

ఇతర ఫీచర్లు: ఫోన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది మిలిటరీ గ్రేడ్ దృఢత్వం కలిగి ఉంది. ఇది MIL-STD-810H సర్టిఫికేషన్ పొందింది. ఫోన్ అనుకోకుండా కింద పడినా, ఫోన్ పై నీరు పడినా, ఎటువంటి హాని జరగదు. ఇది చాలా వేడి లేదా చల్లని ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుంటుంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News