Itel-zeno-5G: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా..? చైనాకు చెందిన ఐటెల్ మార్కెట్లో కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. అదే ఐటెల్ జెనో 5G స్మార్ట్ ఫోన్. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్ల ఉన్న ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో నడుస్తుంది. దాదాపు 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 10 వేల బడ్జెట్ లో ఉండడం విశేషం. ఇప్పుడు ఐటెల్ జెనో 5G స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ఫీచర్లు, ధర, సేల్ వివరాలు తెలుసుకుందాం.
ధర, సేల్ వివరాలు
కంపెనీ ఐటెల్ జెనో 5G భారతదేశంలో రూ. 9,299 ధరకు లాంచ్ చేసింది. డిస్కౌంట్ కావాలంటే రూ. 1,000 అమెజాన్ కూపన్‌ను ఉపయోగించి ఈ స్మార్ట్ ఫోన్ ను అతి తక్కువ ధరకు కొనొచ్చు. కాగా, ఐటెల్ జెనో 5G కాల్క్స్ టైటానియం, షాడో బ్లాక్, వేవ్ గ్రీన్ అనే మూడు రంగులలో లభిస్తోంది.
ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్ 6.67-ఇంచ్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లేతో వస్తుంది. అంతేకాకుండా 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఐటెల్ జెనో 5G ఐపీ54 రేటింగ్‌తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌తో తీసుకొచ్చారు. ఈ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్తో నడుస్తుంది. అయితే, ఈ మొబైల్ లో 4GB LPDDR4X RAM, 128GB UFS 2.2 స్టోరేజ్ సౌకర్యం అందుబాటులో ఉంది. వర్చువల్ ర్యామ్ ద్వారా దీని RAMను దాదాపు 4GB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ మందం 7.8mm.
కెమెరా విషయానికి వస్తే.. వెనుక భాగంలో 50ఎంపీ సింగిల్ కెమెరా సెటప్‌ను, ఇక సెల్ఫీలు- వీడియో కాలింగ్ కోసం.. 8ఎంపీ ఫ్రెంట్ కెమెరాను అందించారు. ఈ మొబైల్ ఐటెల్ ఏఐ అసిస్టెంట్ ‘ఐవానా’ను కూడా అనుసంధానిస్తుంది. దీంతో రైటింగ్, ట్రాన్స్ లేషన్ అనువాదం, టెక్ట్స్ దిద్దుబాటు పనులకు సపోర్ట్ చేస్తుంది.
ఇక బ్యాటరీ గురుంచి మాట్లాడితే..ఈ ఫోన్ 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 10వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. డస్ట్, వాటర్ నుంచి రక్షణ పొందడానికి ఈ ఫోన్ IP54 రేటింగ్‌తో వస్తుంది. డ్యూయల్ 5G సిమ్ కార్డులు, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ-సీ కనెక్టివిటీకి వంటి ఫీచర్లు కలిగి ఉంటాయి.