Free Jio Hotstar Subscription: భారత్ లో జియో, ఎయిర్‌టెల్ రెండు అతిపెద్ద టెలికాం కంపెనీలు. ఈ రెండూ సంస్థలు తమ యూజర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. వీటితో వినియోగదారులు ఉచిత OTT సేవలను కూడా పొందుతారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..? ఉచిత OTT సేవల రీఛార్జ్ ప్లాన్స్ కేవలం రూ.100 నుండి ప్రారంభమవుతాయి. జియో, ఎయిర్‌టెల్ రెండూ వారి రూ.100 ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఉచిత OTTని అందిస్తున్నాయి. ఈ రెండు కంపెనీల రూ.100 ప్లాన్ డేటా-మాత్రమే టారిఫ్. అంటే వాటితో ఎటువంటి కాలింగ్ లేదా SMS ప్రయోజనాలు అందుబాటులో ఉండవు. ఈ రెండు ప్లాన్‌లు అదనపు డేటా ప్రయోజనాన్ని అందిస్తాయి. అదేవిధంగా ఉచిత OTT సేవలను కూడా అందిస్తాయి. ఇప్పుడు జియో, ఎయిర్‌టెల్ కేవలం రూ.100 రీఛార్జ్‌తో 90 రోజుల పాటు ఉచిత OTT సేవలను అందించే రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.
Also Read: Motorola New Phone: మార్కెట్లోకి ట్రిపుల్ కెమెరా సెటప్‌తో మోటోరోలా కొత్త ఫోన్.. టీజర్ లాంచ్..
ఎయిర్‌టెల్ రూ.100 ప్లాన్
5GB అదనపు డేటా అవసరమయ్యే ఎయిర్‌టెల్ వినియోగదారులు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. దీని కొనుగోలు చేసుకుంటే జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనం 30 రోజులు పాటు ఆస్వాదించవచ్చు. మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కారణంగా ఈ ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ మొబైల్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌లలో మాత్రమే స్ట్రీమ్ చేయగలుగుతారు.
జియో రూ. 100 ప్లాన్
జియో రూ. 100 ప్లాన్ 5GB అదనపు డేటాను కూడా అందిస్తుంది. కానీ, చెల్లుబాటు పరంగా ఎయిర్‌టెల్‌ను అధిగమించింది. ఈ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అయితే, ఈ ప్లాన్ లో జియో హాట్‌స్టార్ (మొబైల్/టీవీ) సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనం 90 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, వినియోగదారులు మొబైల్, టాబ్లెట్ కాకుండా ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీ స్క్రీన్‌లలో కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు.


