Jio Diwali Dhamaka Offer for 60 Days: దీపావళి పండుగ సందర్బంగా ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో బంపరాఫర్ ప్రకటించింది. తన కస్టమర్ల కోసం ఒక ఆకర్షణీయమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా కంపెనీ జియో హోమ్ సేవలను 2 నెలలు (60 రోజులు) పాటు ఉచితంగా అందిచనున్నట్లు తెలిపింది. ఈ ప్యాకేజీలో అపరిమిత హై స్పీడ్ ఇంటర్నెట్, టీవీ ఛానెల్‌లు, ప్రముఖ ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌లు కూడా లభించనున్నట్లు స్పష్టం చేసింది. కొత్తగా జియో ఫైబర్ నెట్ తీసుకునే యూజర్లతో పాటు ఇప్పటికే ఉన్న యూజర్లకు సైతం ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. జియో హోమ్ ఆఫర్ కింద.. కంపెనీ జియోఫైబర్, ఎయిర్ ఫైబర్ సేవలకు దాదాపు 2 నెలల (దాదాపు 60 రోజులు) ఉచిత ట్రయల్ లభిస్తుంది. ఈ ట్రయల్‌లో భాగంగా అపరిమిత వై-ఫై ఇంటర్నెట్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా కొత్త యూజర్లు వైఫై రౌటర్లు, సెట్-టాప్ బాక్స్‌లు, ఇన్‌స్టాలేషన్‌తో సహా అన్ని సేవలను ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ మొదట 50 రోజులకు మాత్రమే ఉండేది.. కానీ దీపావళి దృష్ట్యా దీన్ని 60 రోజులకు పొడిగించింది రిలయన్స్ జియో.
ఫ్రీ ఇంటర్నెట్, 11 ఓటీటీలు..
ఈ ఆఫర్ కింద జియో తన కస్టమర్లకు ఉచిత ఇంటర్నెట్ యాక్సెస్‌ను మాత్రమే కాకుండా 1,000+ డిజిటల్ టీవీ ఛానెల్‌లు, 11 కంటే ఎక్కువ OTT యాప్‌లను కూడా అందిస్తోంది. దీని బట్టి జియో హోమ్ సర్వీస్ కింద.. ఒకేసారి మూడు సర్వీస్‌లను.. అనగా టీవీ, ఓటీటీ, వైఫై సేవలను పొందవచ్చు. జియో అందిస్తున్న 11కి పైగా ఓటీటీ యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ లో భాగంగా నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, సోనీలివ్, జీ5 వంటివి ఉండనున్నాయి.
ఆఫర్ ఇలా పొందండి..
ఈ ఆఫర్ ప్రస్తుతం జియో సిమ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ముందుగా మీ ప్రాంతంలో జియో హోమ్ సేవలు (జియోఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్) అందుబాటులో ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి. దీని కోసం జియో అధికారిక వెబ్‌సైట్ లేదా మైజియో యాప్‌లోకి వెళ్లి మీ పిన్ కోడ్, ఇన్‌స్టాలేషన్ అడ్రస్ ఎంటర్ చేసి అర్హతను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ప్రాంతంలో సేవలు అందుబాటులో ఉంటే ‘కన్ఫర్మ్ ఇంట్రెప్ట్’ అనే బటన్‌పై క్లిక్ చేసి నిమిషాల్లో ఆఫర్‌ను యాక్టివేట్ చేయవచ్చు. ఇక, ఈ ట్రయల్ ముగిసిన తర్వాత మీరు ఆటోమేటిక్‌గా నెలకు రూ.599 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్లాన్‌లకు మైగ్రేట్ అవుతారు. అప్పటి నుంచి ఈ 60 రోజులు ఉచిత ట్రయల్ ప్రారంభమవుతుంది. మీరు ఎటువంటి డబ్బు చెల్లించకుండానే హై-స్పీడ్ ఇంటర్నెట్, టీవీ, ప్రీమియం ఓటీటీ కంటెంట్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఈ ఆఫర్ ద్వారా మరింత మంది కస్టమర్లను చేర్చుకోవాలని జియో భావిస్తోంది.


