Jio 5G Services : ఐఫోన్ యూజర్లకు రిలయన్స్ జియో గుడ్‌న్యూస్ చెప్పింది. ఐఫోన్ 12, ఆ పైన మోడల్స్ వాడే వినియోగదారులు నేటి(డిసెంబర్ 15) నుంచి అపరిమిత డేటాతో 5జీ సేవలను పొందుతారని గురువారం తెలిపింది. జియో వెల్‌కమ్ ఆఫర్ కింద దీన్ని అందిస్తున్నారు. అయితే.. ఈ ఆఫర్‌ను పొందేందుకు వినియోగదారులు తాజా iPhone iOS మరియు క్యారియర్ సెట్టింగ్‌లకు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
iPhone 12 Mini, iPhone 12, iPhone 12 Pro, iPhone 12 Pro Max, iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro, iPhone 13, Pro Max, iPhone SE 2022 (3వ తరం), iPhone 14, iPhone 14 ప్లస్ యజమానులు iPhone 14 Pro మరియు iPhone 14 Pro Max వినియోగదారులు తమ సాఫ్ట్‌వేర్ ను iOS 16.2 లేదా ఆ తరువాతి వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకుని అపరిమిత జియో 5 జీ సేవలను పొందవచ్చు.
iPhoneలో 5G ఎలా యాక్టివేట్ చేయాలి?
ఐఫోన్‌లో సెట్టింగ్స్ ఆప్షన్‌ను ఓపెన్ చేసి జనరల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ పై సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై ట్యాప్ చేయాలి. అక్కడ iOS 16.2ని డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. నిబంధనలు, షరతులను యాక్సెప్ట్ చేసి, అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అప్‌డేట్ ఇన్‌స్టాల్ అయి, ఫోన్ రీస్టార్ట్ అయిన తర్వాత నోటిఫికేషన్ ప్రాంతంలో కొత్త 5G స్టేటస్(వైఫై యాక్టివ్‌లో లేకపోతే) కనిపిస్తుంది. ఒకవేళ 5G స్టేటస్ కనిపించకపోతే సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెల్యులార్ > సెల్యులార్ డేటా ఆప్షన్‌లకు ట్యాప్ చేయాలి. ఏ సిమ్ నుంచి 5G ఉపయోగించాలని అనుకుంటున్నారో దాన్ని సెలక్ట్ చేయాలి.
జియో 5జీ అపరిమిత సేవలు పొందాలంటే సెట్టింగ్‌లో 5జీ ఆన్‌చేసి ఆ తరువాత 5జీ స్టాండలోన్‌ను ఆన్ చేయాల్సి ఉంటుందని జియో తెలిపింది.