Jio Recharge Plan Details: దేశంలో ప్రముఖ ప్రైవేట్ టెలికం జియో తన వినియోగదారుల కోసం అనేక చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్లు అపరిమిత కాలింగ్, డేటాతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తాయి. జియో 84 రోజుల చెల్లుబాటుతో అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ఇవి అపరిమిత కాలింగ్‌తో పాటు అపరిమిత 5G, ఉచిత SMS, అలాగే OTT యాప్‌లకు యాక్సెస్ అందిస్తుంది. ఇప్పుడు జియో 84 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న రీఛార్జ్ ప్లాన్ల గురించి తెలుసుకుందాం.
జియో 84 రోజుల రీఛార్జ్ ప్లాన్
జియో ఈ చౌకైన రీఛార్జ్ ప్లాన్ రూ. 1,029. ఈ ప్లాన్‌లో యూజర్లు 84 రోజుల చెల్లుబాటును పొందుతారు. ఈ వ్యవధిలోనే వినియోగదారులు భారతదేశం అంతటా అపరిమిత ఉచిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఈ ప్లాన్ తో ప్రతిరోజూ 2GB హై స్పీడ్ డేటాను ఆస్వాదించవచ్చు. ఈ విధంగా ఈ ప్లాన్ వ్యాలిడిటీలో వినియోగదారులు మొత్తం 168GB హై స్పీడ్ డేటా ప్రయోజనాన్ని పొందుతారు.
అంతేకాకుండా..యూజర్లు ఈ రీఛార్జ్ ప్లాన్ లో రోజుకు 100 ఉచిత SMS ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఇది మాత్రమే కాదు.. వినియోగదారులు ఈ ప్లాన్‌లో OTT యాప్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందుతారు. అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. అలాగే, ఇది జియో టీవీ, జియో క్లౌడ్ యాప్‌కు ఉచిత యాక్సెస్ అందిస్తుంది.
Also read: Vivo X200 FE: వివో X200 FE విడుదల..మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC, 6,500mAh బ్యాటరీ..
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే..?వినియోగదారులు ఈ ప్లాన్ లో అపరిమిత 5G డేటా ప్రయోజనాన్ని పొందొచ్చు. అయితే, దీని కోసం యూజర్లు 5G స్మార్ట్‌ఫోన్ కలిగి ఉండాలి. అలాగే, జియో 5G నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తూ ఉండాలి. ఈ విధంగా ఈ ప్లాన్‌తో ఉచితంగా అపరిమిత ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయవచ్చు.
జియో రూ.1028 రీఛార్జ్ ప్లాన్
ఈ ప్లాన్‌తో పాటు..జియో రూ. 1028 రీఛార్జ్ ప్లాన్‌ను కూడా తమ వినియోగదారులకు అందిస్తోంది. దీనిలో వినియోగదారులకు 84 రోజుల చెల్లుబాటును పొందుతారు. ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉన్న ప్రయోజనాలు చూస్తే..ఈ ప్లాన్ రోజువారీ 2GB హై స్పీడ్ డేటాను కూడా అందిస్తుంది. అలాగే, ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్, రోజువారీ 100 ఉచిత SMSలతో వస్తుంది. దీనిలో వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ వీడియోకు బదులుగా స్విగ్గీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ పొందుతారు.