Jio Recharge Plans: ప్రైవేట్ టెలికాం సంస్థ జియో తన కోట్లాది మంది వినియోగదారులకు అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. వీటిలో దీర్ఘకాలిక చెల్లుబాటు, రోజువారీ డేటా, ఉచిత SMS, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. కంపెనీ భారీ డేటా వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని మాత్రమే అందించే కొన్ని ప్లాన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటువంటి చౌకైన ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ ప్లాన్లలో డేటా లభించదు.. కానీ 336 రోజుల చెల్లుబాటుకాలంలో అపరిమిత కాలింగ్ ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ గొప్ప ప్లాన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
జియో రూ. 1748 రీఛార్జ్ ప్లాన్
జియో రూ.1748 రీఛార్జ్ ప్లాన్ 336 రోజుల దీర్ఘకాలిక చెల్లుబాటుకాలంతో వస్తుంది. కంపెనీ ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. అంటే ఈ ప్లాన్‌తో అపరిమిత కాల్స్ మాట్లాడవచ్చు. దీనితో పాటు, ఇందులో 3600 ఎస్ఎంఎస్ పంపే సౌకర్యాన్ని కూడా కంపెనీ అందిస్తోంది. అయితే, ఈ ప్లాన్‌లో ఎటువంటి డేటా సౌకర్యం మాత్రం లభించదు. కేవలం కాలింగ్ ప్లాన్ మాత్రమే కోరుకునే వారి కోసం ఇది ఉత్తమం. అంతేకాకుండా ఈరోజుల్లో చాలా మంది తమ ఇళ్లలో వైఫై ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అలాంటి వారికీ కూడా ఈ ప్లాన్ ఎంతో ప్రయోజనకరం.
Also Read: Jio Recharge Plan: జియో రీచార్జ్ ప్లాన్..రోజుకి 2జీబీ డేటా, ఉచితంగా అమెజాన్ ప్రైమ్..
జియో రూ. 448 రీఛార్జ్ ప్లాన్
ఈ విభాగంలో జియో రూ. 448 ప్లాన్‌ను కూడా అందిస్తోంది. దీనిలో 84 రోజుల చెల్లుబాటును పొందొచ్చు. ఈ చౌక ప్లాన్‌లో లభించే ప్రయోజనాలు రూ. 1748 ప్లాన్‌ని పోలి ఉంటాయి. అంటే ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. దీనితో పాటు, ఈ ప్లాన్‌లో 1000 ఎస్ఎంఎస్ పంపే సౌకర్యాన్ని కూడా కంపెనీ అందిస్తోంది.


