Kia Carens Clavis EV Launched: కియా తన మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ MPV కారెన్స్ క్లావిస్ EVని భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. కంపెనీ కియా కారెన్స్ క్లావిస్ EVని భారత మార్కెట్లో రూ. 17.99 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేసింది. అయితే, దీని టాప్ మోడల్ ధర మాత్రం రూ. 24.49 లక్షలు. ఈ ఎలక్ట్రిక్ MPV ఒకే ఛార్జ్‌తో 490 కి.మీ. వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. కియా కారెన్స్ క్లావిస్ EVలో కస్టమర్లు గొప్ప సౌకర్యంతో చాలా మెడల్ టెక్నాలజీని పొందుతారు. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సింగల్ ఛార్జ్ తో 490 కి.మీ. పరిధి
కియా కారెన్స్ క్లావిస్ EV కారులో రెండు బ్యాటరీ ప్యాక్‌ల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 42kWh, 51.4kWh బ్యాటరీలు ఉన్నాయి. 42kWh చిన్న బ్యాటరీ ప్యాక్‌తో సింగల్ ఛార్జ్‌పై 404 కి.మీ, అదేవిధంగా 51.4kWh బిగ్ బ్యాటరీ ప్యాక్‌తో 490 కి.మీ. పరిధిని అందుకోగలదని కంపెనీ చెబుతోంది. కాగా, ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 8.4 సెకన్లలో 0 నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు.
ALSO READ: Tata Motors : ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లపై జూలై నెలలో బంపర్ ఆఫర్లు… ఇప్పుడే సొంతం చేసుకోండి!
12.3-అంగుళాల బిగ్ స్క్రీన్
డిజైన్ గురించి చెప్పాలంటే..కియా కారెన్స్ క్లావిస్ EVలో ఫ్రంట్ గ్రిల్, ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, LED లైట్ బార్‌తో కొన్ని మార్పులు చేశారు. అంతేకాకుండా ఇంటీరియర్‌లో డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
360-డిగ్రీ కెమెరా
భద్రత విషయానికి వస్తే..ఈ EVలో 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS లెవల్-2, ESC, TPMS, 360-డిగ్రీ కెమెరా, i-పెడల్ టెక్నాలజీ వంటి ఆధునిక లక్షణాలు ఉన్నాయి. దీనితో పాటు, ఇది V2L (వెహికల్ టు లోడ్), V2V (వెహికల్ టు వెహికల్) ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కాగా, భారతీయ మార్కెట్లో EV హ్యుందాయ్ క్రెటా EV, టాటా కర్వ్ EV, MG ZS EV వంటి మోడళ్లతో నేరుగా పోటీపడుతుంది.


