Sunday, July 13, 2025
Homeటెక్నాలజీKodak 43 inch JioTele OS Smart TV Launched: చవక ధరలో స్మార్ట్‌టీవీ కొనాలా?.....

Kodak 43 inch JioTele OS Smart TV Launched: చవక ధరలో స్మార్ట్‌టీవీ కొనాలా?.. 43 అంగుళాల డిస్‌ప్లే, JioTele OS తో QLED TV లాంచ్!

Kodak 43 inch JioTele OS Smart TV Launched: కోడాక్ టీవీ ఇండియా భారతదేశంలో జియోటెలిఓఎస్ తో తన మొదటి స్మార్ట్ టీవీని మార్కెట్లోకి విడుదల చేసింది. కోడాక్ 43 అంగుళాల 4K QLED మోడల్ (KQ43JTV0010) ను ప్రత్యేకంగా వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని అందుబాటులోకి తీసుకొచ్చారు.  ఈ స్మార్ట్ టీవీ 43 అంగుళాల 4K QLED స్క్రీన్, 40W డాల్బీ స్పీకర్లతో బెజెల్-లెస్ డిజైన్‌, 2GB RAM కలిగి ఉంటుంది. బిగ్ స్క్రీన్‌తో తయారు చేయబడిన ఈ Kodak స్మార్ట్ టీవీ గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

జియోటెలిఓఎస్ తో వస్తున్న ఈ స్మార్ట్ టీవీలో అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ టీవీ 200 కంటే ఎక్కువ యాప్‌లతో జియో స్టోర్ ను కలిగి ఉంది. అంతేకాకుండా 300 కంటే ఎక్కువ ఉచిత లైవ్ టీవీ ఛానెల్‌లు, 300 కంటే ఎక్కువ JioGames, AI-ఆధారిత కంటెంట్ సిఫార్సులు, క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ కోసం రియల్-టైమ్ అప్‌డేట్‌లతో ప్రత్యేక స్పోర్ట్స్ హబ్ అందించారు. ఇక వాయిస్-సపోర్ట్ రిమోట్‌లో నెట్ ఫ్లిక్, జియో సినిమా, యూట్యూబ్ కోసం ప్రత్యేక బటన్‌లు ఉన్నాయి.

ఫీచర్లు

కోడాక్ 43″ జియో టెలి సిరీస్ QLED TV (మోడల్: KQ43JTV0010) స్లిమ్, బెజెల్-లెస్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ టీవీ 43-అంగుళాల QLED, 4K (3840 x 2160 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది HDRకి మద్దతు ఇస్తుంది. ఈ టెలివిజన్ Amlogic చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చింది. జియోటెలిఓఎస్ తో, ఈ టీవీ 400 కంటే ఎక్కువ ఉచిత లైవ్ టీవీ ఛానెల్‌లను పొందుతుంది.

ఈ టీవీ 40W డాల్బీ డిజిటల్ ప్లస్ స్టీరియో బాక్స్ స్పీకర్‌లతో వస్తుంది. టీవీలో 2GB RAM, 8GB స్టోరేజ్ ఉన్నాయి. దీనితో పాటు, బ్లూటూత్ 5.0, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, 2x USB, 3x HDMI,, 1x RJ45, AV పోర్ట్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. వినియోగదారులు టీవీలో స్పోర్ట్స్ మోడ్, గూగుల్ అసిస్టెంట్, బహుభాషా వాయిస్ సెర్చ్ వంటి ఫీచర్‌లను కూడా పొందుతారు.

ధర

కోడాక్ 43 అంగుళాల QLED 4K స్మార్ట్ టీవీ ధర భారత్ లో రూ. 18,990కు అందుబాటులో ఉంది. అమెజాన్ ఇండియాలో కొనుగోలు చేయొచ్చు. కాగా, ఈ టీవీ 1-సంవత్సరం వారంటీతో వస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News