Kodak Matrix Series Launched: పండుగ సీజన్‌కు ముందు కోడాక్ భారతదేశంలో కొత్త శ్రేణి మ్యాట్రిక్స్ సిరీస్‌లో టీవీలను విడుదల చేసింది. కోడాక్ కొత్త టీవీలు నాలుగు స్క్రీన్ సైజులలో లాంచ్ చేసింది. 43, 50, 55, 65-అంగుళాలు. ఈ టీవీలు రాబోయే అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ తాజా టీవీలు రూ.20,000 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండటం విశేషం. కోడాక్ కొత్త టీవీలు క్యూఎల్‌ఇడి విజువల్స్, మెరుగైన సౌండ్ సిస్టమ్‌లు ముందే ఇన్‌స్టాల్ చేయబడిన యాప్‌లతో వస్తాయి. ఇప్పుడు ధర, ఫీచర్ల గురించి గురించి వివరంగా తెలుసుకుందాం.
ఫీచర్లు:
కోడాక్ తాజా టీవీలు క్యూఎల్‌ఇడి 4K డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఈ డిస్‌ప్లే 1 బిలియన్ రంగులకు మద్దతు ఇస్తుంది. మెరుగైన దృశ్య అనుభవం కోసం ఇది HDR10, WCGకి కూడా మద్దతు ఇస్తుంది. ఈ ప్రీమియం-లుకింగ్ టీవీలో బెజెల్-లెస్ మెటాలిక్ డిజైన్ ఉంది. ఈ కోడాక్ టీవీ డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ ప్లస్, DTS ట్రూసరౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ అద్భుతమైన ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. కోడాక్ 43, 50-అంగుళాల టీవీలు 50W స్పీకర్లను కలిగి ఉంటాయి. అయితే 55, 65-అంగుళాల టీవీలు 60W స్పీకర్లను కలిగి ఉన్నాయి.
Also Read: Redmi 15C 5G Launched: 6000mAh బ్యాటరీతో రెడ్‌మి 15C 5G విడుదల.. ఫీచర్స్ అదుర్స్..
ఈ కోడాక్ టీవీలలో గూగుల్ టీవీ ప్లాట్‌ఫారమ్‌తో పాటు అంతర్నిర్మిత గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్, ఎయిర్‌ప్లేను వంటి ఫీచర్లు ఉన్నాయి. యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుండి కూడా ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఈ కోడాక్ టీవీ క్వాడ్-కోర్ ARM కార్టెక్స్ A55 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది AI PQ చిప్‌సెట్, 2GB RAM, 16GB నిల్వతో వస్తుంది. టీవీ 3 HDMI పోర్ట్‌లు (ARC, CEC), 2 USB పోర్ట్‌లు, ఆప్టికల్ అవుట్‌పుట్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0 లకు కూడా మద్దతు ఇస్తుంది.
ధర:
65 అంగుళాల మోడల్ (65ST5035): రూ. 37,999
55 అంగుళాల మోడల్ (55ST5025): రూ. 27,649
50 అంగుళాల మోడల్ (50ST5015): రూ. 23,999
43 అంగుళాల మోడల్ (43ST5005): రూ. 18,799
ఈ టివిలురాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు ఈ టీవీల కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ & ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై 10% తగ్గింపు పొందొచ్చు. అంతేకాదు, నో-కాస్ట్ EMI ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌లో SBI డెబిట్, క్రెడిట్ కార్డులపై 10% తగ్గింపు లభిస్తుంది.


